Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 ప్రెస్‌మీట్‌లో రష్మిక మందన్న నోరు జారింది. బూతు పదం వాడేసింది. అదే ఈవెంట్‌లో హీరో షాహిద్‌కపూర్ తీరుతో రష్మిక ఇబ్బంది పడినట్లుగా కనిపించింది.
Entertainment | Published On May 18, 2026, 2.29 pm IST
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న నోరు జారింది. బాలీవుడ్ మూవీ ప్రెస్‌మీట్‌లో బూతు పదం వాడేసింది. తన తప్పును గ్రహించి వెంటనే సారీ చెప్పింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు కృతి సనన్ మరో హీరోయిన్‌గా కనిపించబోతుంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తోన్నారు.
బూతు పదం...
కాక్ టెయిల్ 2 సినిమాలోని ఓ సాంగ్‌ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌కు రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ కూడా అటెండ్ అయ్యింది. ఈ వేడుకలో కృతి సనన్ అందంపై రష్మిక పొగడ్తలు కురిపించింది. "కృతి సనన్ చాలా హాట్. అది అందరికి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మరింత బోల్డ్‌గా కనిపిస్తుంది. ఫ***హాట్" అంటూ రష్మిక నోరు జారింది. బూతు పదం వాడానని గ్రహించిన రష్మిక వెంటనే సారీ చెప్పింది. ఈ పదాన్ని కట్ చేయండి అంటూ టీమ్‌ను కోరింది. రష్మిక మాటలతో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
కొత్తగా ఉంటుంది....
"కాక్‌టెయిల్ ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఇందులో షాహిద్, కృతితో పాటు నాకు మధ్య వచ్చే సీన్లు, మా ముగ్గురి కెమిస్ట్రీ కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటల్లో చూసింది తక్కువే. సినిమాలో అంతకుమించిన సర్‌ప్రైజ్‌లు చాలా ఉంటాయి" అని రష్మిక మందన్న అన్నది.
భుజంపై చేయివేయబోయిన హీరో...
కాక్‌టెయిల్ 2 ప్రెస్‌మీట్‌లో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక ఇబ్బంది పడినట్లు కనిపించింది. ఈ ఈవెంట్‌లో రష్మిక, షాహిద్ పక్కపక్కనే నిల్చున్నారు. ప్రెస్‌మీట్ జరుగుతోండగా రష్మిక భుజంపై షాహిద్ కపూర్ చేయివేయబోయాడు. అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైన రష్మిక పక్కకు తప్పుకున్నది. నవ్వుతూనే కనిపించినప్పటికీ రష్మిక ఇబ్బందిగా ఫీలైనట్లు ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలిసిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాహిద్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
సీక్వెల్...
సైఫ్ అలీఖాన్, దీపికా పడుకోణ్ హీరోహీరోయిన్లుగా 2012లో రిలీజైన కాక్ టెయిల్ మూవీకి సీక్వెల్‌గా కాక్ టెయిల్ 2 తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్లుగా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Kriti Sanon | విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ – రష్మిక రికమండేషనా?
ఏప్రిల్ 30, 2026

Rashmika Mandanna | గ్లోబల్ స్టేజ్‌పై నేషనల్ క్రష్ …. టోక్యో యానిమే అవార్డ్స్ ప్రజెంటర్‌గా రష్మిక
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



