Virosh Wedding | సొంతూరికి ‘విరోష్’ జంట.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ముస్తాబవుతున్న దేవరకొండ ఇల్లు!
వివాహం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట తొలిసారిగా తమ సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మెన్‌పేటకు వెళ్లనున్నారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు అభిమానులకు భారీ విందు ప్లాన్ చేసినట్లు సమాచారం.
Virosh Wedding | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక తర్వాత, ఈ కొత్త జంట ప్రస్తుతం హైదరాబాద్ చేరుకుంది. తదుపరి కార్యక్రమాలు, రిసెప్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న 'విరోష్' దంపతుల గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
తెలంగాణలోని తన సొంతూరు అయిన నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మెన్‌పేటకు విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మికతో కలిసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా ఈ జంట సొంతూరికి వస్తుండటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
తుమ్మెన్‌పేట ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు
మార్చి 2వ తేదీన తుమ్మెన్‌పేటలోని విజయ్ ఫామ్ హౌస్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. నూతన వధూవరులు ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వేడుక కోసం గ్రామంలోని ఆయన ఫామ్ హౌస్‌ను సర్వాంగ సుందరంగా, ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
అభిమానులకు భారీ విందు
పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 2 వేల మంది అభిమానులు, గ్రామస్తుల కోసం భారీ విందును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై విజయ్ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరోను పెళ్లికొడుకు గెటప్‌లో, హీరోయిన్‌ను కోడలిగా సొంతూరిలో చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక తాజ్ కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ జరగనున్న విషయం తెలిసిందే. ఏదేమైనా.. విరోష్ జంట రాకతో తుమ్మెన్‌పేటలో సందడి వాతావరణం నెలకొంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ బర్త్‌డే సర్ప్రైజ్ – చేతిలో గన్‌తో రౌడీ జనార్ధన… రొమాంటిక్ పోస్టర్ రిలీజ్
మే 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



