Vijay Deverakonda | విజయ్ దేవరకొండ బర్త్‌డే సర్‌ప్రైజ్ – చేతిలో గన్‌తో రౌడీ జనార్ధన… రొమాంటిక్ పోస్టర్ రిలీజ్
విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా రౌడీ జనార్ధన నుంచి సర్‌ప్రైజ్ అప్‌డేట్ వచ్చేసింది. ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On May 9, 2026, 11.15 am IST
Vijay Deverakonda | ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాలతో హీరోగా బిజీగా ఉన్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. హిస్టారియల్, యాక్షన్, మైథాలజీ...ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శనివారం విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా అతడి కొత్త మూవీ రౌడీ జనార్ధన నుంచి సర్‌ప్రైజ్ అప్‌డేట్ వచ్చేసింది. ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు.
గన్ పట్టుకొని...
ఇందులో వర్షంలో తడుస్తూ చేతిలో గన్ పట్టుకొని మాస్ లుక్‌లో విజయ్ కనిపిస్తున్నాడు. అతడి గుండెలపై ఓ యువతి కాలు పెట్టి ఉండటం ఆసక్తిని పంచుతోంది. ప్రపంచంతో పోరాడుతాడు. ప్రేమకు మాత్రం లొంగిపోతాడు అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో...
రౌడీ జనార్ధన మూవీకి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రౌడీగా విజయ్ మాస్ డైలాగ్స్, అటిట్యూడ్ డిఫరెంట్‌గా ఉంటాయని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాజశేఖర్ విలన్‌గా...
రౌడీ జనార్ధనలో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫ్యామిలీ స్టార్ తర్వాత దిల్‌రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా ఇది. రౌడీ జానర్ధనతో పాటు హిస్టారికల్ కాన్సెప్ట్‌తో రణబాలి సినిమా చేస్తోన్నాడు విజయ్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లలో ఏకకాలంలో పాల్గొంటున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథాలజీ మూవీని అంగీకరించాడు.
సంబంధిత వార్తలు

Keerthy Suresh | జిమ్‌లో తెగ కష్టపడుతున్న కీర్తి సురేష్ – వర్కవుట్ ఫొటోలు చూశారా!
మే 17, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



