త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas | గుర్రం పైనుంచి ప‌డిన ప్ర‌భాస్‌.. ఫౌజీ షూటింగ్‌లో డార్లింగ్‌ చేతికి గాయం!

Prabhas | పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) నుంచి రానున్న త‌దుప‌రి సినిమా `ఫౌజీ` (Fauzi). దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

G

Movies | Published On Feb 16, 2026, 9.31 am IST

Prabhas | గుర్రం పైనుంచి ప‌డిన ప్ర‌భాస్‌.. ఫౌజీ షూటింగ్‌లో డార్లింగ్‌ చేతికి గాయం!
Advertisement

Prabhas | త్రినేత్ర‌.న్యూస్‌: పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) నుంచి రానున్న త‌దుప‌రి సినిమా `ఫౌజీ` (Fauzi). దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌ని, కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్‌లు చిత్రీక‌రించాల్సి ఉన్నంద‌ని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్ర‌భాస్ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. గుర్రంపైనుంచి కింద పడ్డారని, దీంతో చేతికి గాయమైందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న‌ది. గాయం చిన్నదేనని, వెంట‌నే చిత్ర బృందం ప్ర‌థ‌మ చికిత్స అందించార‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సినీ వర్గాలు వెల్ల‌డించాయి. ఒక‌టి రెండు రోజులు విశ్రాంతి త‌ర్వాత డార్లింగ్ మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొంటార‌ని స‌మాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ‌డ‌లేదు. న్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ప్ర‌భాస్‌ ఓ కొత్త అవతారంలో కనిపిస్తారని సినీవ‌ర్గాల్లో టాక్‌. ఆయ‌న‌ స‌ర‌స‌న ఇమాన్వీ (Imanvi) న‌టిస్తుండ‌గా, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, జయప్రద, భానుచందర్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ద‌స‌రా కానుక‌గా విడుదల చేయ‌డానికి సినిమా యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్ర‌భాస్ గత‌ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులోనే ఆయ‌న‌ క్యారెక్టర్ ఎలా ఉండనుందో క్లూ కూడా ఇచ్చారు. 'పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు, పుట్టుకతోనే అతను ఒక యోధుడు' అని మేకర్స్ సంస్కృతంలో పేర్కొన్నారు. ఈ అప్డేట్​తో సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.

Advertisement

తాజావార్తలు

Advertisement