Bhogi | ఆగస్టు 28న శర్వా యాక్షన్ డ్రామా..! పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న భోగీ..!
Bhogi | చార్మింగ్ స్టార్ శర్వాంద్ తొలిసారిగా యాక్షన్ డ్రామా భోగీ.. మూవీలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకె రాధామోహన్ ఎపిక్ స్కేల్లో నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
Bhogi | చార్మింగ్ స్టార్ శర్వాంద్ తొలిసారిగా యాక్షన్ డ్రామా భోగీ.. మూవీలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకె రాధామోహన్ ఎపిక్ స్కేల్లో నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్లో ఇది అతిపెద్ద, ప్రతిష్టాత్మక వెంచర్‌గా ఉంటుందని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో శర్వా ఇప్పటివరకు ఎవరూ చూడని రగ్గడ్, ఫెరోషస్ అవతార్‌లో కనిపించాడు. గడ్డం, మీసాలు, కర్లింగ్ జుట్టుతో రఫ్ లుక్‌లో దర్శన మిచ్చాడు.
డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌పై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని డిజైన్ చేస్తున్నారు. చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నె, సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






