Mahesh Babu | సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. ఎందుకంటే?
Mahesh Babu | సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబు (Mahesh Babu) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
Mahesh Babu | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబు (Mahesh Babu) భేటీ అయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు శాలువాకప్పి ముఖ్యమంత్రి సత్కరించారు. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అయితే, ఇరువురు ఏఏ అంశాలపై చర్చించుకున్నారనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఇరువురి భేటీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. ‘ఇద్దరు ప్రముఖులు కలిస్తే ఆ క్షణం ప్రత్యేకంగా మారుతుంది. ఒకరు లక్షలాది మంది మనసులను గెలుచుకున్న సూపర్‌స్టార్ కాగా, మరొకరు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రజా నాయకుడు’ అని అర్థం వచ్చేలా ఓ పోస్టు వైరల్‌గా మారింది.
వారణాసి పనుల్లో మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌వరల్డ్ మూవీ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. సుమారు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న టైమ్‌ట్రావెల్ అడ్వెంచర్ మూవీలో మహేశ్ ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో (Varanasi) ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు తొలిసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే వీఎఫ్ఎక్స్, పోస్ట్‌ప్రొడక్షన్ పనుల నేపథ్యంలో విడుదల వాయిదా పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఏప్రిల్ 7న కాకుండా ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శనివారం MCRHRD లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు మహేష్ బాబు.
Actor Mahesh Babu Pays a Courtesy Visit to Chief Minister Revanth Reddy at MCRHRD on Saturday.
#MaheshBabu #RevanthReddy https://t.co/P3G7dzpJN4
— Congress for Telangana (@Congress4TS) November 29, 2026
తాజావార్తలు
- ●IND Vs NZ Test | రెండోటెస్ట్‌లో నుంచి ఆకాశ్‌దీప్ అవుట్.. సిరాజ్‌కు మళ్లీ మొండి చేయి!
- ●KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్
- ●Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?
- ●CM Ramesh | బీజేపీ ఎంపీ ఇంట్లో దొంగలు.. రూ.18 లక్షలు చోరీ
- ●Harish Rao | భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్: హరీశ్ రావు
- ●Cabinet Expansion | మోదీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం?

IND Vs NZ Test | రెండోటెస్ట్‌లో నుంచి ఆకాశ్‌దీప్ అవుట్.. సిరాజ్‌కు మళ్లీ మొండి చేయి!

KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్

Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?

CM Ramesh | బీజేపీ ఎంపీ ఇంట్లో దొంగలు.. రూ.18 లక్షలు చోరీ






