త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yedula Reservoir | ఏదుల నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోయకండి

Yedula Reservoir | పాల‌మూరు ఎత్తిపోత‌ల‌లో భాగ‌మైన ఏదుల రిజ‌ర్వాయ‌ర్ నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోసే ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Oct 22, 2026, 7.42 pm IST

Yedula Reservoir | ఏదుల నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోయకండి
Advertisement

మంత్రి ఉత్త‌మ్‌కు పాల‌మూరు నేత‌ల విజ్ఞ‌ప్తి

Yedula Reservoir | త్రినేత్ర న్యూస్ : పాల‌మూరు ఎత్తిపోత‌ల‌లో భాగ‌మైన ఏదుల రిజ‌ర్వాయ‌ర్ నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోసే ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. గురువారం మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు స‌మావేశ‌మ‌య్యారు. ఏదుల నుంచి డిండికి నీళ్లు త‌ర‌లించే విష‌యంపై దాదాపు గంట‌న్న‌ర‌కు పైగా చ‌ర్చ కొన‌సాగింది.

ఈ సంద‌ర్భంగా ఏదుల నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా డిండికి నీళ్లు తీసుకోవాల‌ని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు మంత్రి ఉత్త‌మ్‌, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, జానారెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. డిండి ప్రాజెక్టుకు నీరు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, ఏదుల నుంచి నీటిని తీసుకుంటే పాలమూరు ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అధికారులతో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement