త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Driving License | డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్‌లో కీలక మార్పులు.. ఎప్ప‌టినుంచంటే!

Driving License | దేశంలో రానురాను రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ (Driving License)ల జారీని మరింత కఠిన‌త‌రం చేయ‌నుంది.

S

Telangana | Published On Oct 22, 2026, 7.14 pm IST

Driving License | డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్‌లో కీలక మార్పులు.. ఎప్ప‌టినుంచంటే!
Advertisement

Driving License | త్రినేత్ర న్యూస్‌: దేశంలో రానురాను రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ (Driving License)ల జారీని మరింత కఠిన‌త‌రం చేయ‌నుంది. సుర‌క్షిత డ్రైవింగ్ ట్యుటోరియ‌ల్ ప‌రీక్ష‌లో పాస్ మార్కుల‌ను ప్ర‌స్తుతం ఉన్న 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాల‌ని కేంద్రం ప్ర‌తిపాదించింది. ఈ మార్పులు ప్ర‌స్తుతం ముసాయిదా ద‌శ‌లోనే ఉన్నాయి. తుది నోటిఫికేష‌న్ విడుద‌లైన త‌రువాతే ఇవి అమ‌లులోకి రానున్నాయి.

లైసెన్స్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాల మార్పులకు గడువులు విధించడంతో పాటు, పరీవాహన్ పోర్టల్ ద్వారా కొన్ని ఆన్‌లైన్ సేవలను ఉచితంగా అందించాలని సైతం సూచించింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందినవారికి ప్రాక్టికల్ టెస్ట్ మినహాయింపు కొనసాగనుంది.

Advertisement
Advertisement