త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangaram Song | సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ ‘బంగారం’ సాంగ్‌.. డెమాన్ ప‌వ‌న్, రీతూ కెమిస్ట్రీపై ప్ర‌శంస‌లు

Bangaram Song | బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన 'బంగారం' ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెలోడీ, విజువల్స్, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

S

Movies | Published On Aug 6, 2026, 5.10 pm IST

Bangaram Song | సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ ‘బంగారం’ సాంగ్‌.. డెమాన్ ప‌వ‌న్, రీతూ కెమిస్ట్రీపై ప్ర‌శంస‌లు
Advertisement

Bangaram Song | త్రినేత్ర‌.న్యూస్‌: బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన 'బంగారం' ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొదటి నుంచి చివరి వరకు ఫీల్ గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ పాటలో పవన్, రీతూ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉండటంతో ఈ పాటను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తున్నారు. మెలోడీ, విజువల్స్, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఈ పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. సమీరా భరద్వాజ్ వోకల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ముఖ్యంగా రణ్జిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ ఈ పాటకు పెద్ద ప్లస్ అయ్యింది. మెలోడీ, బీట్‌లు, అరేంజ్‌మెంట్ అన్నీ కలిసి పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి. మ్యూజిక్, విజువల్స్, ఫ్రెష్ కెమిస్ట్రీతో 'బంగారం' సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోండ‌డంతో మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డెమాన్ పవన్ మాట్లాడారు. బిగ్‌బాస్ ద్వారా నాకు ఎంతో ప్రేమ, ఆదరణ లభించింది. ఆ ప్రేమతోనే ఈ పాటను నిర్మించాను. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా లిరిసిస్ట్, కంపోజర్ అఫ్రోజ్ అలీకి, సింగర్ సమీరా భరద్వాజ్‌కు థ్యాంక్యూ. ఈ పాటను మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. DP Creations బ్యానర్‌ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సాంగ్‌ను ఇంత గ్రాండ్‌గా లాంచ్ చేశాం. భవిష్యత్తులో డీపీ క్రియేషన్స్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు, బిగ్ స్క్రీన్ చిత్రాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాను. దానికి కూడా మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి. ఈ సాంగ్‌లో రీతూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ పాట కోసం అన్నీ చాలా బాగా కలిసి వచ్చాయి. మా ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నాగార్జున ఈ సాంగ్‌ను లాంచ్ చేసి చాలా బాగుందని చెప్పడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఉప్పలపాటి శ్యామలాదేవి ప్రోమో లాంచ్ చేసి లాంచ్ చేసి సపోర్ట్ చేశారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు.

లాంచ్ ఈవెంట్‌లో రీతూ మాట్లాడింది. ఈ సాంగ్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా డెమాన్ పవన్ కోసం ఈ సాంగ్ చేశాను. పవన్ ఎంతో ప్యాషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ ప్రయాణంలో తనూజ, అఖిల్, నిసర్గ నాకు చాలా దగ్గరయ్యారు. వాళ్లందరూ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్, మ్యూజిక్ టీమ్, టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే ఈ పాట ఇంత అందంగా వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ పాటను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు ఇలాగే మాపై ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ సో మచ్ అంటూ రీతూ చెప్పుకొచ్చింది.

సమీరా భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికీ థ్యాంక్యూ. పవన్, రీతూ కలిసి చాలా మంచి పాట చేశారు. ఇది నిజంగా బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట మీద నమ్మకంతో వాళ్లు నిర్మించారు. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులు ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. అనంత‌రం లిరిసిస్ట్, కంపోజర్, సింగర్ అఫ్రోజ్ అలీ మాట్లాడారు. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. చాలా క్రేజీగా ఈ పాటను రాశాను. మేమంతా ఒక టీమ్‌లా కలిసి ఈ సాంగ్‌ను రూపొందించాం. ఇలాగే మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ముందుకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అని మ్యూజిక్ డైరెక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు.

డైరెక్టర్ అండ్‌ కొరియోగ్రాఫర్ విజ్జు ముధిరాజ్ మాట్లాడుతూ.. పవన్, రీతూకి ధన్యవాదాలు. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ పాటను ఆదరించి మరింత పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement