Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?
Hero Motors | హీరో మోటార్స్, జిందాల్ సుప్రీమ్, ఎస్‌ఎస్ రిటైల్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేశాయి. ఈ మూడు కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజున భిన్నమైన ఫలితాలను నమోదు చేశాయి. హీరో మోటార్స్ షేర్లు డిస్కౌంట్‌తో ప్రారంభం కాగా, జిందాల్ సుప్రీమ్, ఎస్‌ఎస్ రిటైల్ షేర్లు భారీ ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశించాయి.
Hero Motors | హీరో మోటార్స్, జిందాల్ సుప్రీమ్, ఎస్‌ఎస్ రిటైల్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేశాయి. ఈ మూడు కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజున భిన్నమైన ఫలితాలను నమోదు చేశాయి. హీరో మోటార్స్ షేర్లు డిస్కౌంట్‌తో ప్రారంభం కాగా, జిందాల్ సుప్రీమ్, ఎస్‌ఎస్ రిటైల్ షేర్లు భారీ ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశించాయి. హీరో మోటార్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.82 వద్ద, బీఎస్‌ఈలో రూ.82.10 వద్ద లిస్టయింది. కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ.84తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో 2.38 శాతం, బీఎస్‌ఈలో 2.26 శాతం డిస్కౌంట్‌తో షేరు ప్రారంభమైంది. కంపెనీ ఐపీఓకు మొత్తం 6.66 రెట్ల స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 8.23 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 9.86 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా 1.49 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.1వేయి కోట్ల విలువైన ఈ ఐపీఓలో రూ.600 కోట్ల తాజా షేర్ల జారీ, రూ.400 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి.
జిందాల్ సుప్రీమ్..
మరోవైపు జిందాల్ సుప్రీమ్ షేర్లు బలమైన లిస్టింగ్‌ను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ రెండింటిలోనూ రూ.320 వద్ద షేరు ప్రారంభమైంది. రూ.254 ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 25.98 శాతం ప్రీమియం. ఈ ఐపీఓకు ఏకంగా 181.07 రెట్ల సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా 126.41 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 327.99 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 149.34 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మొత్తం రూ.124.88 కోట్ల ఐపీఓలో రూ.99.89 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ, రూ.24.99 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి.
ఎస్‌ఎస్ రిటైల్..
ఎస్‌ఎస్ రిటైల్ షేరు ఈ మూడు కంపెనీల్లో అత్యధిక ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.624 వద్ద లిస్టయిన షేరు, రూ.424 ఇష్యూ ధరతో పోలిస్తే 47.17 శాతం ప్రీమియం నమోదు చేసింది. బీఎస్‌ఈలో రూ.639.10 వద్ద ప్రారంభమై 50.73 శాతం ప్రీమియం ఇచ్చింది. ఎస్‌ఎస్ రిటైల్ ఐపీఓకు బిడ్డింగ్ సమయంలో మొత్తం 103.30 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించింది. రూ.500 కోట్ల విలువైన ఈ ఐపీఓలో రూ.360 కోట్ల తాజా షేర్ల జారీ, రూ.140 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఎస్‌ఎస్ రిటైల్ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.403 నుంచి రూ.424గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు సంబంధించిన మూలధన వ్యయం, అదనపు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది.
తాజావార్తలు
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు
- ●Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
- ●Soaps | సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై ఇక ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు.. కొత్త నిబంధనలు..
- ●RIMS Adilabad | నవజాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల

Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..

Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు

Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు






