CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
CM Revanth Reddy | దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం–1989 అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాస చర్యలపై అధికారులు సమగ్రంగా వివరించారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరును సమీక్షించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లోని 73 గ్రామాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాధితులకు గ్రీన్ ఛానెల్‌లో సాయం
ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బాధితులకు సకాలంలో నష్టపరిహారం, సహాయ పునరావాసం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకునే విషయంలో బడ్జెట్ పరిమితులను కారణంగా చూపకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని సూచించారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం ఘటనలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చదువుతోనే మార్పు
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సొంత తల్లిలా ప్రేమ చూపించారని, ఆ వర్గాలు ఆమెను ఇప్పటికీ మరిచిపోలేదని అన్నారు. 25 లక్షల ఎకరాల భూములకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉండగా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 31 శాతం మంది ఎస్సీ లబ్ధిదారులున్నారని వివరించారు. ఎస్టీ జనాభా 10 శాతం ఉంటే.. వారికి 17 శాతం ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని చెప్పారు.
3.48 కోట్ల మందికి సన్న బియ్యం..
3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు చదువే జీవితాలను మార్చగలదని సీఎం స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలను విద్య వైపు నడిపించకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు తోట్ల కిరణ్‌కుమార్, మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళి నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
సెప్టెంబర్ 22, 2026

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
సెప్టెంబర్ 22, 2026

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది



