Allu Arjun | ముంబైలో లగ్జరీ ఫ్లాట్ తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అక్కడే సెటిల్ అవుతున్నాడా?
Allu Arjun | పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నిలుపుకోవాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇక అదే సినిమాతో అల్లు అర్జున్ చిక్కుల్లో కూడా కూరుకుపోయాడు.
Allu Arjun | త్రినేత్ర.న్యూస్: పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నిలుపుకోవాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇక అదే సినిమాతో అల్లు అర్జున్ చిక్కుల్లో కూడా కూరుకుపోయాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, జైలు, బెయిలు వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ముంబైలో ఫ్లాట్ తీసుకోవడంతో అక్కడే సెటిల్ అవుతున్నాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
కష్టమవుతున్న ప్రయాణం..!
బన్నీ ముంబైకి మకాం మారుస్తున్నాడని గత రెండు రోజులుగా కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం, నిజంగానే ముంబైకి వెళ్లిపోవడమే. అయితే ఇందులో సగం మాత్రమే నిజం ఉందని తెలుస్తున్నది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. దీని షూటింగ్ మొత్తం ముంబైలోని ఓ స్టూడియోలో జరుగుతున్నది. దీంతో హైదరాబాద్, ముంబై మధ్య ప్రయాణం కష్టంగా మారడంతో తాత్కాలికంగా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి.
అల్లు అరవింద్ ఏమన్నారంటే..
అయితే స్టైలిష్ స్టార్ ముంబైలో ఫ్లాట్ కొనలేదని తెలుస్తున్నది. కొన్ని రోజులపాటు అక్కడే ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తవగానే హైదరాబాద్‌కి తిరిగి వస్తాడని చెప్పారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





