Jaggareddy | సంగారెడ్డిలో హైటెన్షన్.. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి
సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికే సీఐ వచ్చారంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పూర్తిగా సహకరించారని మండిపడ్డారు. అందుకే 34వ వార్డులో ఎన్నికలు రద్దు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
- 34వ వార్డులో ఉద్రిక్తత
- పోలీంగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లి ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి
- కాంగ్రెస్ అభ్యర్థి గళ్లని సీఐ పట్టుకున్నారని రచ్చ
- పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట
Jaggareddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపు అక్కడ హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఫోటో తీసే ప్రయత్నం చేశారని అక్కడే పోలీంగ్ డ్యూటీలో ఉన్న సీఐ శివకుమార్ ఆ అభ్యర్థిని పోలింగ్ బూత్ నుంచి గళ్ల పట్టుకొని బయటికి పంపించారన్న సమాచారంతో పోలింగ్ బూత్‌కు చేరుకున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లి పోలింగ్ ఆపేస్తా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకున్న సీఐ వెంటనే ఇక్కడికి రావాలని పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ అక్కడకు చేరుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. సీఐ, పోలీసులపై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు, జగ్గారెడ్డి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికే సీఐ వచ్చారంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పూర్తిగా సహకరించారని మండిపడ్డారు. అందుకే 34వ వార్డులో ఎన్నికలు రద్దు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






