CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 45 ఎకరాల భూమి లెక్క తేలకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సరిహద్దుల్లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.
సంక్షిప్త సారాంశం
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం ఉండాల్సిన 388 ఎకరాల్లో 45 ఎకరాలు కనిపించకుండా పోయినట్లు రెవెన్యూ సర్వేలో తేలింది. ఆ 45 ఎకరాల జాడ కనిపెట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి, సరిహద్దు భూములున్న మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు రికార్డుల సమర్పణపై నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్వే నంబర్ 325 భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అమరవీరుల కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించి, జూన్ 2 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు.
- అమరవీరులకు ఇళ్ల స్థలాలు
CM Revanth Reddy Erravalli Review | త్రినేత్ర న్యూస్ : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు చేపట్టిన తాజా సర్వే వివరాలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో రికార్డుల్లో ఉండాల్సిన భూమి క్షేత్రస్థాయిలో కనిపించకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రికార్డుల్లో 388.. గ్రౌండ్లో 343 మాత్రమే
ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండాలి. అయితే, అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన 45 ఎకరాల భూమి ఎటు వెళ్లిందన్నది లెక్క తేలకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ మిస్సయిన 45 ఎకరాల భూమి ఎక్కడుందో, ఎవరి ఆక్రమణలో ఉందో వెంటనే నిగ్గు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు.
Also Read | రాహుల్! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన
కేసీఆర్ కుటుంబానికి నోటీసులు జారీ
ఈ భూముల సరిహద్దులను కచ్చితంగా గుర్తించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ సర్వే నంబర్‌కు ఆనుకుని ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రాల సరిహద్దులు కూడా ఉండటంతో వారికి అధికారికంగా నోటీసులు జారీ చేయనున్నారు. తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులు, డాక్యుమెంట్లను వెంటనే సమర్పించాలని అధికారులు ఆ నోటీసుల్లో కోరనున్నారు.
అమరవీరుల కాలనీ నిర్మాణం.. జూన్ 2 డెడ్‌లైన్
సర్వే నంబర్ 325లోని భూమిని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేసింది.
సర్వే పూర్తయిన తర్వాత ఆ భూమిని స్థానిక అర్హులైన పేద రైతులకు పంపిణీ చేస్తారు.
ఇదే ప్రాంగణంలో ప్రత్యేకంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాల కోసం అత్యాధునిక మౌలిక వసతులతో "తెలంగాణ అమరవీరుల కాలనీ"ని నిర్మిస్తారు.
అమరవీరుల కుటుంబాలకు ఇక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం నిర్ణయించారు.
ఈ కాలనీ సమగ్ర నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు.
Also Read | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



