త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WiFi Router | రాత్రి పూట నిద్రకు ముందు వైఫై రూట‌ర్‌ను ఆఫ్ చేయాలా..? ఎందుక‌ని..?

WiFi Router | ఒక‌ప్పుడు ఇంట‌ర్నెట్ కావాలంటే క‌చ్చితంగా ఇంట‌ర్ నెట్ సెంట‌ర్‌ల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. వాటినే సైబ‌ర్ కేఫ్ లేదా ఇంట‌ర్నెట్ కేఫ్ అని పిలిచేవారు. ఇంటర్నెట్ అవ‌స‌రం అయిన ప్ర‌తిసారి నెట్ సెంట‌ర్‌కు వెళ్లాల్సిందే. అయితే టెక్నాల‌జీలో వచ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల కార‌ణంగా ప్ర‌స్తుతం మ‌న ఫోన్ల‌లోనే హైస్పీడ్ ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉంది.

S

Health | Published On Jan 10, 2026, 12.36 pm IST

WiFi Router | రాత్రి పూట నిద్రకు ముందు వైఫై రూట‌ర్‌ను ఆఫ్ చేయాలా..? ఎందుక‌ని..?
Advertisement

WiFi Router | ఒక‌ప్పుడు ఇంట‌ర్నెట్ కావాలంటే క‌చ్చితంగా ఇంట‌ర్ నెట్ సెంట‌ర్‌ల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. వాటినే సైబ‌ర్ కేఫ్ లేదా ఇంట‌ర్నెట్ కేఫ్ అని పిలిచేవారు. ఇంటర్నెట్ అవ‌స‌రం అయిన ప్ర‌తిసారి నెట్ సెంట‌ర్‌కు వెళ్లాల్సిందే. అయితే టెక్నాల‌జీలో వచ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల కార‌ణంగా ప్ర‌స్తుతం మ‌న ఫోన్ల‌లోనే హైస్పీడ్ ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉంది. దీంతో మ‌న‌కు ఇప్పుడు ఇంట‌ర్నెట్ సెంట‌ర్‌ల‌కు వెళ్లే అవ‌స‌రం త‌ప్పింది. అయితే ఫోన్ల‌తోపాటు ఇంట్లోనూ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను చాలా మంది ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో వైఫై రూట‌ర్‌ను పెట్టుకోవ‌డం ద్వారా మ‌నం ఆ సేవ‌ల‌ను పొందుతున్నాం. అయితే వైఫై రూట‌ర్‌ను పెట్టుకోవ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది కానీ దాన్ని వాడే విష‌యంలోనే జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి పూట ఆఫ్ చేయాలి..

ఇంట్లో వైఫై రూటర్‌ల‌ను వాడుతున్న‌వారు రాత్రి పూట నిద్ర‌కు ముందు వాటిని ఆఫ్ చేస్తే మంచిద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే వైఫై రూట‌ర్‌ల నుంచి ఎల‌క్ట్రో మాగ్నెటిక్ త‌రంగాలు నిరంత‌రం విడుద‌ల‌వుతూనే ఉంటాయి. అవి మ‌న‌కు ఇంట‌ర్నెట్‌తోపాటు నెట్ వ‌ర్క్ సేవ‌ల‌ను అందిస్తాయి. అయితే రాత్రి పూట మ‌నం ఇంట‌ర్నెట్ ను ఉప‌యోగించం క‌నుక వైఫై రూట‌ర్‌ను ఆఫ్ చేస్తే మంచిది. దీని వ‌ల్ల వాటి నుంచి ఎల‌క్ట్రో మాగ్నెటిక్ త‌రంగాలు వెలువ‌డ‌వు. ఫ‌లితంగా నిద్ర చక్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి త‌గ్గుతుంది. అయితే ఈ త‌రంగాల‌కు, మ‌న నిద్ర‌కు సంబంధం ఏమిటిని చాలా మందికి సందేహాలు రావ‌చ్చు. కానీ దీనిపై సైంటిస్టులు శాస్త్రీయంగా ప్రయోగాల‌ను కూడా నిర్వ‌హించారు.

ప‌రిశోధ‌న‌ల్లో ఏం తేలింది..?

ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఈ విష‌యంపై 2024లోనే ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో తేలిందేమిటంటే వైఫై రూట‌ర్‌ల‌కు ద‌గ్గ‌రగా నిద్రించే వారు నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, అలాంటి వారి సంఖ్య 27 శాతంగా ఉంద‌ని చెప్పారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా వారు వైఫై రూట‌ర్‌ను ఆఫ్ చేసి నిద్రిస్తే వారి నిద్ర మెరుగు ప‌డింద‌ని గుర్తించామని తెలిపారు. అందువ‌ల్ల రాత్రి పూట వైఫై రూట‌ర్‌ను ఆఫ్ చేసి ప‌డుకుంటే మేల‌ని అంటున్నారు. అయితే వైఫై రూటర్‌ను ఆఫ్ చేయ‌క‌పోయినా దాని వ‌ల్ల మ‌న ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర దుష్ప్ర‌భావాలు ప‌డ‌వ‌ని, కానీ నిద్ర‌కు మాత్రం భంగం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలియ‌జేసింది. అయితే హోమ్ ఆటోమేష‌న్ ఉన్న‌వారు వైఫైని ఆఫ్ చేయ‌డం కుద‌ర‌దు. క‌నుక వారు రూట‌ర్‌ను బెడ్ రూమ్‌లో కాకుండా బ‌య‌ట వేరే రూమ్‌లో దాన్ని పెట్టుకోవ‌డం మంచిదని సూచిస్తున్నారు. ఇలా వైఫై రూట‌ర్‌కు దూరంగా ఉంటే నిద్ర మెరుగు ప‌డుతుంద‌ని అంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement