Watermelon Vs Muskmelon | వేసవిలో పుచ్చకాయలు వర్సెస్ తర్బూజాలు.. వేటిని తింటే ఎక్కువ మేలు జరుగుతుంది..?
Watermelon Vs Muskmelon | వేసవి కాలంలో అందరూ శరీరాన్ని చల్లగా ఉంచుకునే మార్గాలను అన్వేషిస్తుంటారు. అందులో భాగంగానే నీళ్లను అధికంగా తాగడం, కొబ్బరి నీళ్లను సేవించడం వంటివి చేస్తుంటారు. అలాగే ఈ సీజన్‌లో అధికంగా లభించే పుచ్చకాయలు, తర్బూజా వంటి పండ్లను కూడా ఎక్కువగా తింటుంటారు.
Watermelon Vs Muskmelon | వేసవి కాలంలో అందరూ శరీరాన్ని చల్లగా ఉంచుకునే మార్గాలను అన్వేషిస్తుంటారు. అందులో భాగంగానే నీళ్లను అధికంగా తాగడం, కొబ్బరి నీళ్లను సేవించడం వంటివి చేస్తుంటారు. అలాగే ఈ సీజన్‌లో అధికంగా లభించే పుచ్చకాయలు, తర్బూజా వంటి పండ్లను కూడా ఎక్కువగా తింటుంటారు. అయితే పుచ్చకాయలు, తర్బూజా రెండూ శరీరానికి ఎంతో మేలు చేసేవే. వేసవిలో శరీరానికి కావల్సిన హైడ్రేషన్‌ను ఇవి అందిస్తాయి. అయితే దీంతోపాటు ఇవి ఇంకా ఇతర భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వాటి గురించి పోషకాహార నిపుణులు వివరాలను తెలియజేస్తున్నారు.
పోషకాల పరంగా చూస్తే..
ఈ రెండు పండ్లలో పోషక విలువలు వేర్వేరుగా ఉంటాయి. 100 గ్రాముల పరిమాణంలో వీటి పోషక గుణాలను పరిశీలిస్తే.. పుచ్చకాయల్లో 30 క్యాలరీల శక్తి, గ్లైసెమిక్ ఇండెక్స్ 72-80 (అధికం), ఫైబర్ 0.4 గ్రాములు, విటమిన్ A 569 IU, విటమిన్ C 8.1 మిల్లీగ్రాములు, పొటాషియం 112 మిల్లీగ్రాములు, నీటి శాతం 91.4 ఉంటుంది. ఇక తర్బూజాలో 34 క్యాలరీల శక్తి, గ్లైసెమిక్ ఇండెక్స్ 65-70 (మధ్యస్థం), ఫైబర్ 0.9 గ్రాములు, విటమిన్ A 3382 IU (కళ్ల ఆరోగ్యానికి మంచిది), విటమిన్ C 36.7 మిల్లీగ్రాములు (ఇమ్యూనిటీకి ఉపయోగకరం), పొటాషియం 267 మిల్లీగ్రాములు (బీపీ నియంత్రణకు మంచిది), నీటి శాతం 90.2 ఉంటుంది.
ఏ పండ్లు ఏం చేస్తాయి..?
అయితే వేసవిలో చల్లని పుచ్చకాయ ముక్కలను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాదాపు 92 శాతం నీరు ఉండటం వల్ల ఇది సహజంగానే దాహాన్ని తీరుస్తుంది. తీవ్ర వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. పుచ్చకాయలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యకిరణాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే ఎల్-సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం కండరాల నొప్పిని తగ్గించి రికవరీ వేగాన్ని పెంచుతుంది. దీని వల్ల ఒళ్లు నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసిన వారు పుచ్చకాయలను తింటే త్వరగా రికవర్ అయి ఉత్సాహం లభిస్తుంది. మళ్లీ యథావిధిగా పనులు చేయగలుగుతారు. పుచ్చకాయ నీటి శాతంలో ముందుంటే, తర్బూజా పోషకాల్లో ముందుంటుంది. తర్బూజాలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవిలో తరచూ వచ్చే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తర్బూజాలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యానికి, చర్మ కాంతికి మేలు చేస్తుంది. అలాగే పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
వేటిని తినాలి..?
అయితే బరువు తగ్గాలని చూస్తున్నవారు లేదా నియంత్రణలో ఉండాలని భావించే వారు తమ లక్ష్యం ఆధారంగా పండ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. క్యాలరీలను తగ్గించాలంటే పుచ్చకాయ మంచి ఎంపిక. తక్కువ క్యాలరీలు ఉండడంతో ఎక్కువ పరిమాణంలో తినవచ్చు. అయితే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగి మళ్లీ ఆకలి త్వరగా వేస్తుంది. అయితే పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉండాలంటే తర్బూజా మంచిది. ఎక్కువ ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా దీని ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. ఈ రెండు పండ్లను రాత్రివేళల్లో తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ నీరు, సహజ చక్కెరల కారణంగా నిద్రలో అంతరాయం కలిగే అవకాశాలు ఉంటాయి. శరీరంలో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు పండ్ల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఉత్తమ ఎంపిక ఏ పండు అని కచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే ఇవి భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తాయి. అందువల్ల వేసవిలో ఈ రెండింటిని మార్చి మార్చి తినవచ్చు. వేడిలో తక్షణ చల్లదనం కోసం పుచ్చకాయ పనిచేస్తే, పోషకాలు, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం కోసం తర్బూజా పనిచేస్తుంది. అందువల్ల ఈ రెండింటినీ సమానంగా తింటే అన్ని లాభాలను పొందవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
సెప్టెంబర్ 10, 2026

Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు
సెప్టెంబర్ 10, 2026

Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది



