త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sleeping In Car | పార్కింగ్ చేసిన‌ప్పుడు కార్ల‌లో నిద్రిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Sleeping In Car | కార్ల‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు చాలా మంది కాస్త విరామం ల‌భిస్తే కారును ప‌క్క‌కు ఆపి లేదా పార్కింగ్ లో ఉంచి నిద్రిస్తుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంటారు. ముఖ్యంగా టాక్సీలు న‌డిపేవారు ఇలా చేస్తుంటారు. అలాగే త‌ర‌చూ కార్ల‌లో ప్ర‌యాణించే వారు ఎక్కువ‌గా ఇలా చేస్తుంటారు.

S

Health | Published On Jan 1, 2026, 8.11 am IST

Sleeping In Car | పార్కింగ్ చేసిన‌ప్పుడు కార్ల‌లో నిద్రిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!
Advertisement

Sleeping In Car | కార్ల‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు చాలా మంది కాస్త విరామం ల‌భిస్తే కారును ప‌క్క‌కు ఆపి లేదా పార్కింగ్ లో ఉంచి నిద్రిస్తుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంటారు. ముఖ్యంగా టాక్సీలు న‌డిపేవారు ఇలా చేస్తుంటారు. అలాగే త‌ర‌చూ కార్ల‌లో ప్ర‌యాణించే వారు ఎక్కువ‌గా ఇలా చేస్తుంటారు. అయితే కార్ల‌లో నిద్రించ‌డం ప్ర‌మాక‌ర‌మని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రాణాపాయం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటున్నారు. కార్ల‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన వాయువులు కొన్ని సార్లు బంధించ‌బ‌డ‌తాయి. అలాగే తీవ్ర‌మైన ఉష్ణోగ్ర‌త‌ల ప్ర‌భావం కూడా ఉంటుంది. అలాంటి ప‌రిస్థితుల్లో కార్ల‌లో కాసేపు నిద్రించ‌డం కూడా ప్ర‌మాద‌క‌ర‌మే అని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. అలా కార్ల‌లో నిద్రించడం వ‌ల్ల ప్ర‌స్తుతం చాలా మంది చ‌నిపోతున్నార‌ని కూడా వెల్ల‌డించారు.

కార్బ‌న్ మోనాక్సైడ్ కార‌ణం..

కార్ల నుంచి వెలువ‌డే పొగలో అనేక కాలుష్య కార‌కాలు, విష వాయువుల‌తోపాటు కార్బ‌న్ మోనాక్సైడ్ కూడా ఉంటుంది. దీనికి రంగు ఉండ‌దు. ఈ క్ర‌మంలో మనం కారులో నిద్రించేట‌ప్పుడు కొన్ని సార్లు కారులో ఉండే గ్యాప్స్ లేదా స‌రిగ్గా మూత వేయ‌ని సీల్స్ కార‌ణంగా స‌ద‌రు కార్బ‌న్ మోనాక్సైడ్ కారు లోప‌ల చేరి అక్క‌డే ఉండిపోతుంది. అలాంటి సంద‌ర్భాల్లో కారులో కిటికీల‌ను పూర్తిగా మూసేసి ఉంచితే కార్బ‌న్ మోనాక్సైడ్ కారులోనే ట్రాప్ అవుతుంది. ఈ క్ర‌మంలో కారులో నిద్రిస్తే మనం తెలియ‌కుండానే కార్బ‌న్ మోనాక్సైడ్‌ను పీల్చుకుంటాం. దీని వ‌ల్ల కొన్ని క్ష‌ణాల్లోనే ప్ర‌మాదం సంభ‌విస్తుంది. కార్బ‌న్ మోనాక్సైడ్ మ‌న శ‌రీరంలో చేరి రక్తంలో హిమోగ్లోబిన్ తో క‌లుస్తుంది. దానికి అతుక్కుపోతుంది. దీంతో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంది. ఈ కార‌ణంగా వెంట‌నే స్పృహ త‌ప్పుతారు. కొన్ని నిమిషాల్లోనే మ‌ర‌ణం సంభ‌విస్తుంది. క‌నుక కార్ల‌లో అలా నిద్రించ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు.

అల‌స‌ట కూడా..

అయితే కేవ‌లం కార్ల‌లో అలా నిద్రించ‌డం వ‌ల్లే కాకుండా, గంట‌ల త‌ర‌బ‌డి కార్ లేదా ఇత‌ర వాహ‌నాల‌ను న‌డిపేవారు తీవ్ర‌మైన అల‌స‌ట‌కు గురి కావడం వ‌ల్ల కూడా వాహన ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ఇలా అల‌స‌ట కార‌ణంగా ఏకంగా 19 శాతం మంది ప్ర‌మాదాల బారిన ప‌డి చ‌నిపోతున్న‌ట్లు తేలింది. ఇక మన దేశంలోనూ ప‌రిస్థితి ఇలాగే ఉంద‌ని గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అందువ‌ల్ల అల‌స‌ట‌గా ఉన్న‌ప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్ర‌యాణాన్ని కొన‌సాగించ‌డం ఉత్త‌మం. అయితే వాహ‌నంలో మాత్రం నిద్రించ‌కూడ‌దు. వాహ‌నాన్ని బ‌య‌ట ఎక్క‌డైనా పార్కింగ్ స్థ‌లంలో నిలిపి ఏదైనా హోట‌ల్ లేదా రెస్టింగ్ రూమ్స్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటే ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement