Samsung | శాంసంగ్ చెప్పినట్లు ఈ చిన్న పనిచేస్తే.. రూ.500 అమెజాన్ గిఫ్ట్ కార్డు మీదే..!
Samsung | శామ్‌సంగ్ ఇండియా ఫిట్ ఇండియా వాక్-ఎ-థాన్ 26 పేరిట ఓ వినూత్న స్టెప్ కౌంట్ ఛాలెంజ్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని శామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో నిర్వహించనుండగా, 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరింకుని దీన్ని ప్రారంభించనున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయించిన స్టెప్పుల లక్ష్యాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా చేరుకోవాల్సి ఉంటుంది.
Samsung | శామ్‌సంగ్ ఇండియా ఫిట్ ఇండియా వాక్-ఎ-థాన్ 26 పేరిట ఓ వినూత్న స్టెప్ కౌంట్ ఛాలెంజ్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని శామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో నిర్వహించనుండగా, 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరింకుని దీన్ని ప్రారంభించనున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయించిన స్టెప్పుల లక్ష్యాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు మొత్తం 2 లక్షల అడుగులు (200,000 స్టెప్పులు) పూర్తి చేయాలి. పాల్గొనే ప్రతి వ్యక్తి అడుగుల లెక్కను (స్టెప్ కౌంట్) శామ్‌సంగ్ హెల్త్ యాప్ ద్వారానే నమోదు చేస్తారు. యాప్‌లో లీడర్‌బోర్డ్ సౌకర్యం ఉండటంతో, ఇతరులతో పోల్చుకుని తమ ప్రోగ్రెస్‌ను, ర్యాంకింగ్‌ను కూడా చూసుకునే వీలుంటుంది.
లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి లక్కీ డ్రా అవకాశం ఉంటుంది. అర్హులైన వినియోగదారులకు శామ్‌సంగ్ మెంబర్స్ యాప్‌లోని బెనిఫిట్స్ విభాగంలో స్క్రాచ్ కార్డు అందించబడుతుంది. ఈ లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలకు రూ.10,000 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డులు అందజేస్తారు. అదనంగా మరో వెయ్యి మందికి రూ.500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డులు గెలుచుకునే అవకాశం ఉంటుంది.
2 లక్షల స్టెప్స్‌ను పూర్తి చేయాలి..
ఈ ఛాలెంజ్‌కు రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 22 నుంచి శామ్‌సంగ్ హెల్త్ యాప్ ద్వారా ప్రారంభం కాగా కార్యక్రమం జనవరి 26న ప్రారంభమై ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుంది. మొత్తం 30 రోజుల పాటు ఈ వాక్-ఎ-థాన్ నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా యూజర్లు 30 రోజుల పాటు రోజూ తమకు తోచిన రీతిలో వాకింగ్ చేస్తూ కొన్ని స్టెప్స్ దూరాన్ని పూర్తి చేయవచ్చు. ఇలా నెల రోజుల్లో 2 లక్షల స్టెప్పులను పూర్తి చేయాలి. దీంతో చాలెంజ్ పూర్తి చేసినట్లు అవుతుంది. అప్పుడు విజేతలకు ప్రోత్సాహక బహుమతులతోపాటు లక్కీ డ్రా గిఫ్ట్‌లను కూడా అందిస్తారు. ఇలా ఈ కార్యక్రమంలో యూజర్లు పాల్గొనవచ్చు. అయితే శాంసంగ్‌కు చెందిన హెల్త్ యాప్‌ను వాడాల్సి ఉంటుంది కనుక శాంసంగ్ ఫోన్, వాచ్ వంటి వాటిని ఈ కార్యక్రమంలో చాలా వరకు ఉపయోగించాల్సి ఉంటుంది.
ఫిట్ ఇండియా వాక్-ఎ-థాన్ 26 కేవలం భారత్‌లోని వినియోగదారులకు మాత్రమే పరిమితం కాగా, శామ్‌సంగ్ హెల్త్ యాప్ ఉపయోగించే వారు మాత్రమే ఇందులో పాల్గొనవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో శామ్‌సంగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.
సంబంధిత వార్తలు

Samsung | రీఫర్బిష్డ్ ఫోన్లను స్వయంగా విక్రయిస్తున్న శాంసంగ్.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..
మే 11, 2026

Samsung | గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు.. ప్రకటించిన శాంసంగ్..
మే 11, 2026

Samsung Solve for Tomorrow | శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో 5వ ఎడిషన్.. విద్యార్థులు రూ.2 కోట్ల వరకు గ్రాంట్లు పొందే చాన్స్..
మే 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



