Nimesulide | ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అధిక డోసుల్లో వాడొద్దు.. కేంద్రం హెచ్చరిక..
Nimesulide | ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, జ్వరం, వాపులు తగ్గించేందుకు ఉపయోగించే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ డ్రగ్ (NSAID) జాబితాకు చెందిన నైమిసులైడ్ (nimesulide) అనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లకు గాను 100 ఎంజీ కన్నా అధిక మొత్తంలో డోసు కలిగిన ఔషధాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తాజాగా ఒక ప్రకటనలో తెలియజేసింది.
Nimesulide | ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, జ్వరం, వాపులు తగ్గించేందుకు ఉపయోగించే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ డ్రగ్ (NSAID) జాబితాకు చెందిన నైమిసులైడ్ (nimesulide) అనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లకు గాను 100 ఎంజీ కన్నా అధిక మొత్తంలో డోసు కలిగిన ఔషధాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తాజాగా ఒక ప్రకటనలో తెలియజేసింది. నైమిసులైడ్కు చెందిన అధిక డోస్ ట్యాబ్లెట్ల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందనే సైంటిస్టుల అధ్యయనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే నైమిసులైడ్ కు చెందిన 100ఎంజీ కన్నా అధిక డోసు కలిగిన ట్యాబ్లెట్లను నిషేధిస్తున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు వాటిని వాడొద్దని, డాక్టర్లు కూడా ఆ ఔషధానికి చెందిన అధిక డోసు ట్యాబ్లెట్లను రోగులకు ఇవ్వవద్దని కేంద్రం సూచించింది.
100ఎంజీ కన్నా అధిక డోసు అయితేనే..
కాగా నైమిసులైడ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అధిక డోసుల్లో ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం తెలియజేసింది. ఈ ఔషధాన్ని అధిక డోసుల్లో తీసుకుంటే లివర్ విషతుల్యంగా మారుతుందని, లివర్‌లో టాక్సిన్లు పేరుకుపోతాయని, దీంతో లివర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపింది. అందుకనే నైమిసులైడ్ కు చెందిన 100ఎంజీ కన్నా అధిక డోసుల్లో ఉండే ట్యాబ్లెట్లను నిసేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 సెక్షన్ 26ఎ ప్రకారం ఆ ట్యాబ్లెట్ డోసులపై నిషేధం విధిస్తున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆ ఔషధాలను కూడా తయారు చేయకూడదని, వాటిని విక్రయించకూడదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.
చాలా దేశాల్లో నిషేధం..
అయితే నైమిసులైడ్ అధిక డోసు ట్యాబ్లెట్లను మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో ఆ ఔషధాన్నే చాలా వరకు దేశాలు నిషేధించాయి. ఈ ఔషధం వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అందుకనే నైమిసులైడ్ ను నిషేధించినట్లు పలు దేశాలు గతంలోనే తెలిపాయి. అయితే భారత్‌లో మాత్రం ఈ ఔషధాన్ని ప్రస్తుతానికి పూర్తిగా నిషేధించలేదు. కానీ 100ఎంజీ కన్నా అధిక డోసు కలిగిన ట్యాబ్లెట్లనే నిషేధించారు. కనుక ప్రజలు కూడా ఈ ఔషధం వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక నొప్పులు, జ్వరానికి పారాసిటమాల్, ఐబూప్రొఫెన్ వంటి మందులను రోగులకు వైద్యులు ఇవ్వవచ్చని, ఇవి సమస్యలను తగ్గించడంలో మెరుగ్గా పనిచేయడమే కాక, ప్రజల ఆరోగ్యానికి సేఫ్టీ కూడా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేశారు. కాగా ఇదే విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ధ్రువీకరించింది.
తాజావార్తలు
- ●Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
- ●Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు






