Summer Safety Tips | ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే ఇంట్లో ఉన్నా జాగ్రత్త పడాల్సిందే.. వైద్యుల హెచ్చరికలు..
Summer Safety Tips | ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ హీట్‌వేవ్ అలర్ట్ జారీ కాగా, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. తీవ్ర ఎండల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Summer Safety Tips | ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ హీట్‌వేవ్ అలర్ట్ జారీ కాగా, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. తీవ్ర ఎండల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు అవసరమని చాలామందికి తెలిసినా, హీట్‌వేవ్ సమయంలో ఇంట్లో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లోనూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వారు పలు సూచనలు చేస్తున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్లలో ఉన్నప్పటికీ డీహైడ్రేషన్, అలసట, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వంట చేసే వారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. వంట సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి, పొగ, అలసట కలిసి తీవ్రమైన ప్రభావం చూపించి స్పృహ కోల్పోయే పరిస్థితులకూ, ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యలకూ కారణమవుతాయి.
వీరికి రిస్క్ ఎక్కువ..
టెంపరేచర్ జర్నల్‌లో ప్రచురితమైన సమగ్ర అధ్యయనం ప్రకారం, సరైన వెంటిలేషన్ లేకపోవడం, కాంక్రీట్ నిర్మాణాల వల్ల వేడి ఇళ్లలోనే నిలిచిపోతుంది. కాంక్రీట్ వేడిని గ్రహించి నిల్వచేసే లక్షణం కలిగి ఉండటంతో, పట్టణ అపార్ట్‌మెంట్లు వేడి గదులుగా మారుతున్నాయి. వృద్ధులు వయసుతో శరీర వ్యవస్థలు బలహీనపడటం వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. అలాగే శరీరం వేడిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల పిల్లలు కూడా వేడికి రిస్క్ జోన్‌లోనే ఉంటారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందుల ప్రభావంతో శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉండటం వల్ల వారికి కూడా రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ వర్గాలకు చెందిన వారు ఎండల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో అధిక వేడి వల్ల హీట్ ఎగ్జాస్షన్, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
కిటికీలను తెరిచి ఉంచితే..
మధ్యాహ్న సమయంలో సూర్యరశ్మి తీవ్రంగా ఉంటుంది. కర్టెన్లు, బ్లైండ్స్ లేదా రిఫ్లెక్టివ్ ఫిల్మ్స్ ఉపయోగించి నేరుగా వేడి ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలి. తీవ్ర వేడి కేవలం అసౌకర్యం మాత్రమే కాదు. ఇది గుండె, మెదడు, కిడ్నీలు, మెటబాలిజంపై ప్రభావం చూపే మల్టీ-ఆర్గన్ స్ట్రెస్ అని వైద్య నిపుణులు చెబతున్నారు. హీట్‌వేవ్ సమయంలో ఇంట్లో గాలి మార్పిడి చాలా అవసరం. ఉదయం సూర్యకాంతి పెరగకముందే కిటికీలు కొద్దిసేపు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల వేడిగా మారిన గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలికి వస్తుంది. సాయంత్రం కూడా ఇదే ప్రక్రియ చేయాలి. ఇండోర్ ఎయిర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఈ విధానం గదులు వేడి చాంబర్లుగా మారకుండా కాపాడుతుంది. ఫ్యాన్లను కేవలం మూసిన గదిలో ఉపయోగించడం కంటే, కిటికీలు తెరిచి ఉపయోగిస్తే గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. అదనపు చల్లదనం కోసం ఫ్యాన్ ముందు ఐస్ బౌల్ పెట్టుకోవచ్చు.
పగటి పూట వీటిని వాడకండి..
ఓవెన్లు, ఇస్త్రీలు, అధిక వేడి ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను పగటి సమయంలో ఉపయోగించవద్దు. ఒకేసారి ఎక్కువ పరికరాలను ఉపయోగిస్తే ఇంటి ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఎల్ఈడీ లైట్ల వినియోగం కూడా ఇంట్లో వేడి తగ్గించడంలో సహాయపడుతుంది. హీట్‌వేవ్‌ను తట్టుకునేందుకు శరీరానికి తగినంత ద్రవాలు అవసరం. రోజంతా సరిపడా నీరు తాగడం, కొబ్బరి నీరు, ఆమ్ పన్నా, మజ్జిగ వంటి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది. అలాగే అధికంగా కాఫీ లేదా కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోవడం డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. బయట నుంచి వచ్చాక మెడ, చేతులపై తడి వస్త్రాన్ని ఉంచితే శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. హీట్‌వేవ్ సమయంలో ధరించే దుస్తులు కూడా కీలకం. శరీరం శ్వాస తీసుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. సహజ చల్లదనం ఇచ్చే మార్గాలను ఉపయోగించాలి.
వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి..
ఇండోర్ ప్లాంట్స్, తడి కర్టెన్లు, ఖస్ మ్యాట్స్, మట్టి కుండల్లో చల్లని నీరు వంటి సహజ పద్ధతులు ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉపయోగపడతాయి. పలు లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదా వైద్య సహాయం పొందాలి. తలనొప్పి, తల తిరగడం, అధిక చెమటలు లేదా పొడి చర్మం, వాంతుల భావన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే హీట్‌స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చు. హీట్‌వేవ్ సమయంలో ఎక్కువ జాగ్రత్త అవసరమయ్యేవారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, గుండె జబ్బులు లేదా డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర వేడి గుండె ఆరోగ్యంపై, బ్లడ్ షుగర్ స్థాయిలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఈ లక్షణాలు ఉంటే..
పలు లక్షణాలు కనిపిస్తే అత్యవసర వైద్య సహాయం అవసరం అని గుర్తించాలి. అధిక శరీర ఉష్ణోగ్రత, గందరగోళం లేదా అయోమయం, వేగంగా పల్స్ రావడం వంటివి శరీరం తీవ్రంగా ఓవర్‌హీట్ అయిన సంకేతాలుగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. హీట్‌వేవ్ సమయంలో బయట జాగ్రత్తలు ఎంత ముఖ్యమో, ఇంట్లో భద్రత కూడా అంతే అవసరం. చిన్న చిన్న జీవనశైలి మార్పులతోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇంట్లో చల్లదనాన్ని కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026

Cool Drinks | వేసవిలో చల్లదనం కోసం సోడాలు, కూల్‌డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక..
మే 9, 2026
తాజావార్తలు
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..



