Gym | వేసవిలో రోజూ జిమ్ చేసే వారు జాగ్రత్త.. ఈ సూచనలను పాటించండి..
Gym | వేసవి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా రెగ్యులర్‌గా వ్యాయామం చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాసన్, తీవ్రమైన డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇవి ఫిట్‌నెస్ లక్ష్యాలను కూడా దెబ్బతీస్తాయి.
Gym | వేసవి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా రెగ్యులర్‌గా వ్యాయామం చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాసన్, తీవ్రమైన డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇవి ఫిట్‌నెస్ లక్ష్యాలను కూడా దెబ్బతీస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా సురక్షితంగా వర్కౌట్లను కొనసాగించవచ్చు. వేసవిలో ఎక్కువ వేడి, తేమ ఉన్న ప్రాంతాల్లో ఉంటే వ్యాయామ తీవ్రతను కొంత తగ్గించడం మంచిది. సాధారణంగా చేసేంత హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయలేకపోయినా అది సహజమే. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉండి మందులు వాడుతున్నవారు అయితే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తెలుసుకోవాలి.
ఈ సమయంలో జిమ్ వద్దు..
ఉదయం చల్లని సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వ్యాయామం చేయడం ఉత్తమం. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తీవ్రమైన ఎండలో జిమ్ లేదా పార్క్‌లో వ్యాయామం చేయడం ప్రమాదకరం. డార్క్ కలర్ దుస్తులు వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అలాగే బిగుతుగా ఉండే లేదా మందపాటి దుస్తులు శరీరాన్ని మరింత వేడెక్కిస్తాయి. అందుకే లూజ్‌గా ఉండే లైట్ వెయిట్ దుస్తులు ధరించడం మంచిది. ఇవి గాలిని సులభంగా చర్మానికి తాకేలా చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. సరిపడా నీరు తాగుతున్నారా లేదా తెలుసుకోవడానికి యూరిన్ కలర్‌ను గమనించండి. లైట్ యెల్లోగా ఉంటే బాడీ హైడ్రేటెడ్‌గా ఉన్నట్లు. డార్క్ కలర్‌గా ఉంటే మరింత నీరు తాగాలి. ప్రతి 20 నిమిషాల వ్యాయామానికి 8 నుంచి 10 ఔన్సుల నీరు తాగడం మంచిది. వ్యాయామ సమయంలో బాడీ డీహైడ్రేషన్‌లోకి వెళ్లకుండా చూసుకోవాలి.
నీళ్లను మరీ అతిగా తాగవద్దు..
అతిగా నీరు తాగితే హైపర్ హైడ్రేషన్ సమస్య వస్తుంది. దీని వల్ల హైపోనాట్రిమియా అంటే రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. అందుకే వ్యాయామం ముందు, సమయంలో, తర్వాత అవసరమైనంత మాత్రమే నీరు తాగాలి. మిగతా సమయాల్లో దాహం వేసినప్పుడు తాగడం సరిపోతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు తల తిరగడం, అలసట, వాంతుల భావన కలిగితే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. ఓవర్‌గా వర్కౌట్ చేసి అనారోగ్యం పాలయ్యే కంటే కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడం మంచిది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడం కష్టంగా అనిపిస్తే రోజులో చిన్న చిన్న సెషన్‌లుగా విభజించుకుని వ్యాయామం చేయవచ్చు. వ్యాయామానికి ముందు అధిక ప్రోటీన్ తీసుకుంటే శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. అందుకే వర్కౌట్‌కు ముందు 20 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవద్దు. బదులుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే గ్లైకోజెన్ లెవల్స్ పెరిగి వ్యాయామానికి అవసరమైన శక్తి లభిస్తుంది. వర్కౌట్‌కు ముందు చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల హార్ట్ రేట్, స్కిన్ టెంపరేచర్ తగ్గి వేడిలో కూడా మెరుగైన పనితీరును కనబరచగలుగుతారు.
టవల్‌తో ఇలా చేయాలి..
వర్కౌట్‌కు ముందు మెడ వెనుక భాగం, కణతలపై కొన్ని చుక్కల పెప్పర్‌మింట్ లేదా యూకలిప్టస్ ఆయిల్ రాస్తే చల్లదన భావన కలుగుతుంది. అలాగే శ్వాస తీసుకోవడం కూడా సులభమవుతుంది. తేలికపాటి టవల్‌ను నీటిలో ముంచి పిండి ఫ్రీజర్‌లో గంటసేపు ఉంచాలి. వర్కౌట్‌కు వెళ్లే సమయంలో దాన్ని మెడ చుట్టూ వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫిట్‌నెస్ రొటీన్ కొనసాగించవచ్చు. ముఖ్యంగా సరైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే గాయాలు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలను నివారించవచ్చు.
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు






