Heart Diseases | ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లోనూ గుండె జబ్బులు.. కారణాలేంటి..?
Heart Diseases | ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్‌లో గుండెజబ్బులు లేదా హార్ట్ అటాక్స్ తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో హార్ట్ అటాక్ మరణాలు 12.5 శాతం మేర పెరిగాయి.
Heart Diseases | ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్‌లో గుండెజబ్బులు లేదా హార్ట్ అటాక్స్ తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో హార్ట్ అటాక్ మరణాలు 12.5 శాతం మేర పెరిగాయి. ఒకప్పుడు వృద్ధులకు సంబంధించిన సమస్యగా మాత్రమే వచ్చిన గుండెజబ్బులు ఇప్పుడు 30-45 ఏళ్ల మధ్య వయస్సులోని వ్యక్తుల్లో కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురితం అయిన MASALA Study అనే తాజా విశ్లేషణ ప్రకారం భారతీయులను కలుపుకొని దక్షిణాసియన్లలో ఇతరులతో పోలిస్తే గుండెజబ్బుల రేటు ఎక్కువగా ఉందని తేలింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా కూడా గుండె జబ్బులు వస్తున్నట్లు తేల్చారు. కారణం ఏమిటంటే దక్షిణాసియన్ల శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉండడమే. అంతర్గత అవయవాల చుట్టూ కనిపించని కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉండడం, కండరాల శాతం తక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
కారణాలు ఇవే..
ఈ విషయంపై గురుగ్రామ్ మేదాంతలోని క్లినికల్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజీ, కార్డియాక్ కేర్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ బన్సాల్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటున్నాయని తెలిపారు. వంశ పారంపర్యంగా, కుటుంబంలో లేదా అంతకు ముందు వంశంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే, దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురి కావడం, కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించడం, పొగ తాగడం లేదా తాగే వారికి దగ్గరగా ఉండడం, శరీరంలో బయటకు కనిపించని లక్షణాలతో వాపులు ఉండడం, ఇన్‌ఫెక్షన్లు ఏర్పడడం వంటి కారణాల వల్ల గుండెపై ప్రభావం పడుతుందని, అందువల్ల అలాంటి వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినా గుండె జబ్బుల ప్రమాదం ఉంటుందని తెలిపారు.
ఈ సూచనలు పాటించాలి..
ప్రస్తుతం చాలా మంది బరువు సాధారణంగా ఉంటున్నప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు, అనారోగ్యకర కొవ్వులు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో గుండెజబ్బు కనిపిస్తే లోతైన వ్యక్తిగత విశ్లేషణ అవసరమని. జెనెటిక్స్, పర్యావరణం, ఒత్తిడి, ఇతర బయోమార్కర్లు అన్నింటినీ పరిశీలించాలని అన్నారు. కుటుంబ చరిత్రను తెలుసుకోవడం, వైద్యులతో చర్చించడం, ధ్యానం, యోగా, శ్వాసాభ్యాసాలు వంటి స్ట్రెస్ తగ్గించే పద్ధతులు పాటించడం, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమతుల్య ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవడం, రోజుకు 7-9 గంటలు నిద్రపోవడం, తగినంత నీరు తాగడం, తెలియని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం వంటివి పాటిస్తే హార్ట్ ఎటాక్ లు లేదా ఇతర గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
గుండెజబ్బులు కేవలం జీవనశైలితోనే సంబంధం లేకుండా, అనేక అంతర్గత, బయటి కారణాల వల్ల ఏర్పడుతున్నాయి. అయితే సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



