త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coffee | కాఫీని అస‌లు ఎవ‌రు తాగ‌వ‌చ్చు, ఎవ‌రు తాగ‌కూడ‌దు..?

Coffee | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో కాఫీ కూడా ఒకటి. ఇది కేవలం శక్తిని అందించే డ్రింక్ మాత్ర‌మే కాదు, మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాఫీలో ఉండే కేఫీన్‌ అనే పదార్థం కొంతమందిలో తాత్కాలికంగా రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

S

Lifestyle | Published On Jan 18, 2026, 9.40 am IST

Coffee | కాఫీని అస‌లు ఎవ‌రు తాగ‌వ‌చ్చు, ఎవ‌రు తాగ‌కూడ‌దు..?
Advertisement

Coffee | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో కాఫీ కూడా ఒకటి. ఇది కేవలం శక్తిని అందించే డ్రింక్ మాత్ర‌మే కాదు, మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాఫీలో ఉండే కేఫీన్‌ అనే పదార్థం కొంతమందిలో తాత్కాలికంగా రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మితంగా, క్రమంగా కాఫీ తాగేవారిలో రక్తపోటుపై ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కాఫీ రక్తపోటుపై చూపే ప్రభావం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే కాఫీ పరిమాణం, వ్యక్తి జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయి. కాఫీని అరుదుగా తాగే వారిలో రక్తపోటు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాగే హైబీపీ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే రోజుకు ఒకటి నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగితే, ముఖ్యంగా మహిళలు, పొగతాగని వారిలో రక్తపోటుపై ప్రతికూల ప్రభావం ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.

రోజుకు 400 మిల్లీగ్రాముల వ‌ర‌కు..

మితంగా కాఫీని తీసుకుంటే రక్తపోటుకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా FDA సూచనల ప్రకారం, రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్‌ను తీసుకోవడం సురక్షితమే. ఇది సుమారు మూడు కప్పుల కాఫీకి సమానం. అయితే వైద్యుల మాటల్లో చెప్పాలంటే, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు నాలుగు లేదా ఐదు కప్పుల కాఫీ కూడా కొంతమందికి సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నారు. మితంగా తీసుకుంటే కెఫీన్ హానికరం కాకపోయినా, మోతాదు మించితే పలు దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నాడులు ఉత్తేజం చెంద‌డం, నిద్రలేమి, వికారం, వాంతులు, చేతులు, శరీరం వ‌ణ‌క‌డం, అధికంగా మూత్రం రావడం, చిరాకు వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

ఎవ‌రు తీసుకోవ‌ద్దు..?

సాధారణంగా కాఫీలో ఉండే కెఫీన్ సురక్షితమైనదే అయినా, కొన్ని వర్గాల వారు పరిమితంగా తీసుకోవ‌డం లేదా పూర్తిగా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువగా, అంటే ఒకటి నుంచి రెండు చిన్న కప్పుల మోతాదులోనే కాఫీని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుండె కొట్టుకునే వేగంలో స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, అల్స‌ర్లు, గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు, హైబీపీ ఉన్న‌వారు, ఆస్త‌మా, గుండె జ‌బ్బుల‌కు మెడిసిన్ల‌ను వాడేవారు, యాంటీ బ‌యోటిక్స్‌ను ఉప‌యోగించేవారు కాఫీని చాలా త‌క్కువ‌గా ఒక క‌ప్పు మోతాదులో తాగాలి. లేదా పూర్తిగా మానేస్తే మంచిద‌ని చెబుతున్నారు.

ర‌క్త‌పోటు అదుపులో ఉండాలంటే..?

వైద్య శాస్త్రం ఆధారంగా సూచించిన కొన్ని అలవాట్లు రక్తపోటును అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. సరిపడా నిద్రించ‌డం, చక్కెర, పాలు కలపకుండా బ్లాక్ కాఫీ తాగడం, కెఫీన్ లేని గ్రీన్ టీ తీసుకోవడం, యోగా, ధ్యానం, శ్వాసాభ్యాసాలతో ఒత్తిడిని తగ్గించుకోవడం, పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలతో సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం, పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం మానేయడం, మద్యం పరిమితం చేయడం లేదా మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అల‌వాట్ల‌ను పాటించ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటును అదుపులో ఉంచుకోవ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement