Water Fasting Diet | వాటర్ ఫాస్టింగ్ డైట్ అంటే ఏమిటి..? దీని వల్ల శరీరానికి లాభమా, నష్టమా..?
Water Fasting Diet | సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో అనేక రకాల డైట్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిల్లో వాటర్ ఫాస్టింగ్ డైట్ కూడా ఒకటి. సోషల్ మీడియాతోపాటు వెల్ నెస్ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం ఈ డైట్‌ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి.
Water Fasting Diet | సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో అనేక రకాల డైట్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిల్లో వాటర్ ఫాస్టింగ్ డైట్ కూడా ఒకటి. సోషల్ మీడియాతోపాటు వెల్ నెస్ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం ఈ డైట్‌ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ డైట్‌తో అధిక మొత్తంలో బరువు తగ్గామని చెబుతుండడంతో ప్రజలు ఈ డైట్ పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. ఆహారాన్ని పూర్తిగా మానేసి కేవలం నీరు మాత్రమే తీసుకుంటే బరువు తగ్గిపోవచ్చని చెబుతున్నారు. త్వరితగతిన ఫలితాలు రావాలని కోరుకునే వారు, క్లిష్టమైన డైట్‌ను పాటించేవారు ఈ వాటర్ ఫాస్టింగ్ డైట్‌ను పాటిస్తే ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డైట్‌ను నిజంగానే పాటించవచ్చా, పాటిస్తే ఎలా పాటించాలి.. అని చాలా మందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటికి వైద్య నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
వాటర్ ఫాస్టింగ్ డైట్ అంటే..
వాటర్ ఫాస్టింగ్ అంటే ఒక నిర్దిష్టమైన సమయం పాటు కేవలం నీరు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఏ ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇది సాధారణంగా 24 గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఇందులో ఆహారం, జ్యూస్‌లు, టీ, కాఫీ వంటివి ఏవీ తీసుకోకూడదు. బరువు త్వరగా తగ్గడం, డిటాక్స్, మెటబాలిజం మెరుగు పడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని కొందరు చెబుతున్నప్పటికీ శాస్త్రీయంగా ఈ డైట్ లాభాలు నిరూపితం కాలేదు. అలాగే ఈ డైట్‌ను పాటించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పనిగా వైద్యులు చెబుతున్నారు. వాటర్ ఫాస్టింగ్ డైట్‌లో భాగంగా శరీరం ప్రారంభ ధశలో గ్లైకోజెన్ నిల్వలను కరిగిస్తుంది. లివర్, కండరాల్లో నిల్వ ఉండే గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అంటారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గ్లైకోజెన్ నిల్వలు తగ్గితే ఆకలి విపరీతంగా అవుతుంది. చిరాకు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంది.
కొవ్వు శక్తిగా మారి వినియోగం..
వాటర్ ఫాస్టింగ్ డైట్‌లో రెండో దశలో గ్లైకోజెన్ నిల్వలు పూర్తిగా ఖర్చయిన తరువాత శరీరం కొవ్వును శక్తిగా మార్చి వినియోగిస్తుంది. ఈ దశలో కొవ్వు కరగడం మొదలవుతుంది. దీన్ని కీటోసిస్ అని కూడా అంటారు. అయితే మొదటి దశ దాటి ఈ దశకు రావడం చాలా మందికి అయ్యే పనికాదు. ఈ దశకు వచ్చే వరకు విపరీతమైన ఆకలి, నీరసం ఉంటాయి. ఈ దశలో లివర్ కీటోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ప్రత్యామ్నాయ ఇంధనంగా పనిచేస్తాయి. ఈ సమయంలో బరువు తగ్గడం మొదలవుతుంది. అయితే ఈ ప్రక్రియలో శరీరంలో అధికంగా నీరు బయటకు వెళ్లడమే కాకుండా స్వల్పంగా కండరాలకు నష్టం కూడా కలుగుతుంది. నోటి దుర్వాసన, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లాక చాలా వరకు బరువు తగ్గుతారు. కొందరు ఆ నీటి వల్లనే ఎక్కువగా బరువు ఉంటారు.

డిటాక్స్ వ్యవస్థ డిఫాల్ట్‌గా ఉంటుంది..
ఈ డైట్‌ను ఇలాగే కొనసాగిస్తే శరీరం శక్తిని ఆదా చేసేందుకు ఉపక్రమిస్తుంది. దీంతో మెటబాలిజం తగ్గుతుంది. అదే సమయంలో అవసరమైన ప్రోటీన్ల కోసం కండరాలను కరగదీస్తుంది. అయితే ఈ సమయంలో కొందరికి కండరాల నష్టం మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వాటర్ ఫాస్టింగ్ డైట్ అనేది అందరికీ సెట్ అవదు. ఇలా గనక జరిగితే అది ఆరోగ్యకరంగా బరువు తగ్గినట్లు కాదు కనుక అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బలహీనత, బీపీ పడిపోవడం, శారీరక, మానసిక పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వాటర్ ఫాస్టింగ్ ద్వారా శరీరం డిటాక్స్ అవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ శరీరంలో డిఫాల్ట్‌గా ఓ డిటాక్స్ వ్యవస్థ ఉంటుంది. లివర్, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ ఈ వ్యవస్థలోనే భాగంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను నిరంతరం బయటకు పంపిస్తూనే ఉంటాయి. వాటర్ ఫాస్టింగ్ వల్ల డిటాక్స్ ప్రక్రియ గణనీయంగా మెరుగు పడుతుందని బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
మానేశాక ఎక్కువ బరువు పెరిగే ప్రమాదం..
వాటర్ ఫాస్టింగ్ డైట్ అందరికీ ప్రయోజనకరం కాదు. కొందరికి తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో కాకుండా ఈ డైట్‌ను స్వతహాగా పాటిస్తే వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పోషకాహార లోపం, ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత, డీహైడ్రేషన్, తల తిరగడం, ఫిట్స్ రావడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ డైట్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. వాటర్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గుతారు. కానీ అది నిలకడగా ఉండదు. మళ్లీ యథావిధిగా రోజువారి దినచర్య ప్రారంభిస్తారు కనుక తిరిగి బరువు పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో అంతకు ముందు ఉన్న బరువు కన్నా ఇంకా ఎక్కువ బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. డైట్ కారణంగా మెటబాలిజం గణనీయంగా తగ్గుతుంది కనుక శరీరం సమతుల్యతను తిరిగి పొందేందుకు ఆహారం అధికంగా తీసుకోవాలని సూచిస్తుంది. దీంతో తెలియకుండానే అధికంగా తింటారు. ఇది మరింత బరువు పెరిగేందుకు కారణం అవుతుంది.
ఆరోగ్యకరమైన రీతిలో తగ్గడమే ముఖ్యం..
బరువు తగ్గడమే లక్ష్యమైతే వాటర్ ఫాస్టింగ్ డైట్‌ను పాటించకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవడం, రోజూ తగినన్ని నీళ్లను తాగడం, రాత్రి పూట తగినన్ని గంటలపాటు నిద్రించడం, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం వంటి సూచనలు పాటిస్తే బరువు తగ్గుతారని, ఈ ఫలితం దీర్ఘకాలం పాటు ఉంటుందని సూచిస్తున్నారు. వాటర్ ఫాస్టింగ్ డైట్ ఓ తాత్కాలిక పరిష్కారమేనని, ఇది వినేందుకు ఆకర్షణీయంగానే ఉంటుందని, కానీ దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ డైట్ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. తక్షణ లాభాలను అందించినా దీర్ఘకాలంలో నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేగంగా బరువు తగ్గాలన్న ఆలోచన మాని, ఆరోగ్యకరమైన రీతిలో ఎలా బరువును తగ్గించుకోవాలి.. అన్న మార్గాలను అన్వేషించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



