Cucumber | రాత్రిపూట కీరదోసను తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారు..?
Cucumber | వేసవికాలంలో ఎక్కువ మంది ఆహారంలో కీరదోసకాయను తప్పనిసరిగా చేర్చుకుంటారు. దాదాపు 95 శాతం నీరు శాతం కలిగిన ఈ కూరగాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి సమయంలో కీరదోసను తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Cucumber | వేసవికాలంలో ఎక్కువ మంది ఆహారంలో కీరదోసకాయను తప్పనిసరిగా చేర్చుకుంటారు. దాదాపు 95 శాతం నీరు శాతం కలిగిన ఈ కూరగాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి సమయంలో కీరదోసను తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ కుకుంబర్ పేరుతో ప్రచురితమైన జర్నల్‌లో వేసవిలో కీరదోస ఆరోగ్యానికి ఉపయోగకరమైనదే అయినప్పటికీ, రాత్రి సమయంలో తింటే జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడైంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు లేదా గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట నెమ్మదించే జీర్ణ ప్రక్రియ..
భువనేశ్వర్‌లోని మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంబిత్ కుమార్ భుయాన్ మాట్లాడుతూ మన శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే జీర్ణవ్యవస్థ కూడా ఒక సహజ రిథమ్ ప్రకారం పనిచేస్తుందని తెలిపారు. అసమయ భోజనం ఆ ప్రక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. రాత్రివేళ జీర్ణక్రియ మందగించడానికి పలు ప్రధాన కారణాలు ఉంటాయని పేర్కొన్నారు. సూర్యాస్తమయం తర్వాత శరీరం నిద్రకు సిద్ధమవుతుండటంతో మెటబాలిజం, జీర్ఱాశయ యాక్టివిటీ తగ్గిపోతాయని, జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తి తగ్గి, ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. భోజనం చేసిన వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి అసౌకర్యం కలుగుతుందన్నారు.
యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే..
ప్రివెంటివ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు రాత్రిళ్లు కీరదోసను తినడం వల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కీరదోసలో అధిక నీటి శాతం ఉండటం వల్ల జీర్ణక్రియకు అవసరమైన గ్యాస్ట్రిక్ యాసిడ్లు పలుచబడతాయి. తొక్కతో తినే ముడి ఫైబర్‌ను రాత్రి సమయంలో జీర్ణం చేయడం కష్టమవుతుంది. కీరదోస కూలింగ్ నేచర్ కారణంగా సెన్సిటివ్ జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో జీర్ణక్రియ మరింత మందగిస్తుంది. అయితే పగటి సమయంలో తింటే కీరదోసలోని పోషకాలు శరీరానికి బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం..
కీరదోస తిన్న తర్వాత కలిగే అసౌకర్యం వ్యక్తి వ్యక్తికీ మారుతూ ఉంటుంది. కొందరికి స్వల్ప అసౌకర్యమే ఉంటే, మరికొందరికి తీవ్రమైన గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. కీరదోసలోని అధిక నీటి శాతం పొట్టలో అదనపు ద్రవాలను సృష్టిస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణాశయంలో ఫెర్మెంటేషన్ (పులవడం) జరిగి గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి రాత్రి భోజనం తర్వాత కీరదోస తింటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అసిడిటీ లేదా గ్యాస్ట్రిటిస్ ఉన్నవారు, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) బాధితులు, జీర్ణక్రియ మందగించే వృద్ధులు రాత్రిపూట కీరదోసను తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కీరదోసకాను మధ్యాహ్నం లేదా పగటి సమయంలో భోజనంతోపాటు తినడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో జీర్ణవ్యవస్థ చురుకుగా ఉండటం వల్ల పోషకాలు సరిగ్గా శరీరానికి అందుతాయి. వండిన ఆహారంతో కలిపి తింటే మరింత సులభంగా జీర్ణమవుతుందని చెబుతున్నారు.
ఈ సూచనలు పాటించాలి..
రాత్రి సమయంలో కీరదోస తినాల్సి వస్తే పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. నేరుగా ముడిగా తినకూడదు. ప్రోటీన్ లేదా ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవాలి. తేలికపాటి మసాలా లేదా సీజనింగ్‌తో తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో ఈ సమస్యలు తరచూ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ కడుపు ఉబ్బరం లేదా కడుపు నొప్పి, అసిడిటీ, ఛాతిలో మంట, పొట్ట అసౌకర్యంతో నిద్ర భంగం వంటి సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కీర దోస ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయే అయినప్పటికీ, దాన్ని తినే సమయం కూడా అంతే ముఖ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



