Vitamin D In Winter | చలికాలంలో విటమిన్ డి పొందాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Vitamin D In Winter | రోజూ మన శరీరానికి కాసేపు సూర్యరశ్మి తగిలేలా ఉంటే మన శరీరం దానంతట అదే విటమిన్ డిని తయారు చేసుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కనుకనే రోజూ కాసేపు ఎండలో నిలబడాలని చెబుతుంటారు. విటమిన్ డి వల్ల మన శరీరం అనేక జీవక్రియలను సక్రమంగా నిర్వర్తిస్తుంది.
Vitamin D In Winter | రోజూ మన శరీరానికి కాసేపు సూర్యరశ్మి తగిలేలా ఉంటే మన శరీరం దానంతట అదే విటమిన్ డిని తయారు చేసుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కనుకనే రోజూ కాసేపు ఎండలో నిలబడాలని చెబుతుంటారు. విటమిన్ డి వల్ల మన శరీరం అనేక జీవక్రియలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఎముకలకు బలం లభిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకునేందుకు విటమిన్ డి అవసరం అవుతుంది. అలాగే విటమిన్ డి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలోనే విటమిన్ డి మన శరీరంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే అన్ని సీజన్లలోనూ విటమిన్ డి లభిస్తుంది. కానీ చలికాలంలో విటమిన్ డి లభించడం కష్టమవుతుంది. ఎండ సరిగ్గా తగలదు. కనుక ఈ సీజన్‌లో ఆహారాల ద్వారా విటమిన్ డి అందేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో కష్టమే..
అపోలో హాస్పిటల్‌కు చెందిన ఆర్థోపెడిక్ స్పెషలిస్టు డాక్టర్ అభిషేక్ వైష్, రాఠీ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అఖిలేష్ రాఠీలు ఈ విషయమై మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. చలికాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది లేదా సూర్యుడు ఆలస్యంగా వస్తాడు. కనుక ఆ సమయం వరకు విటమిన్ డి పొందడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు తమకు విటమిన్ డిని ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాలి. విటమిన్ డి లభించకపోతే ఎముకలు బలహీనంగా మారుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కనుక విటమిన్ డి లోపం ఏర్పడకుండా ఉండేందుకు పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.. అని తెలిపారు. విటమిన్ డి మనకు సూర్యకాంతి తరువాత చేపల ద్వారానే అధికంగా లభిస్తుందని వారు తెలిపారు. కనుక ఈ సీజన్‌లో చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచించారు.
కీళ్ల ఆరోగ్యానికి..
చేపలను తినడం వల్ల విటమిన్ డి అధికంగా లభిస్తుంది. దీని వల్ల చలికాలంలో కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపులు రాకుండా అడ్డుకోవచ్చు. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. అలాగే ఈ సీజన్‌లో కోడిగుడ్లను కూడా తరచూ తింటుండాలి. గుడ్లలోని పసుపు పచ్చ సొనలోనూ విటమిన్ డి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే ఫోర్టిఫై చేయబడిన పాలు, పెరుగు, తృణ ధాన్యాలు, వృక్ష సంబంధ పాలు మనకు అధికంగా లభిస్తాయి. వీటిల్లోనూ విటమిన్ డి అధికంగానే ఉంటుంది. ఇవి శాకాహారులకు ఎంతో మేలు చేస్తాయి. కనుక విటమిన్ డిని పొందాలంటే వీటిని కూడా తీసుకోవచ్చు.
వీటిని కూడా తినవచ్చు..
పుట్టగొడుగులను తినడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది. అలాగే కాడ్ లివర్ ఆయిల్, చీజ్, పనీర్ వంటి పాల ఉత్పత్తుల ద్వారా కూడా మనం విటమిన్ డి ని పొందవచ్చు. ఈ విధంగా ఆయా ఆహారాలను తీసుకుంటే చలికాలంలో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. దీని వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఆయా వైద్యులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



