త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vitamin B12 Veg Foods | విట‌మిన్ బి12 కోసం నాన్ వెజ్‌ అక్క‌ర్లేదు.. ఈ వెజ్ ఆహారాల‌ను కూడా తీసుకోవ‌చ్చు..

Vitamin B12 Veg Foods | మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరుకు, ఎర్ర రక్త క‌ణాల నిర్మాణానికి దోహ‌ద‌ప‌డుతుంది. అయితే ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఇది ఎక్కువ‌గా నాన్ వెజ్ ఆహారాల్లో ఉంటుంది.

S

Lifestyle | Published On Jan 9, 2026, 8.05 am IST

Vitamin B12 Veg Foods | విట‌మిన్ బి12 కోసం నాన్ వెజ్‌ అక్క‌ర్లేదు.. ఈ వెజ్ ఆహారాల‌ను కూడా తీసుకోవ‌చ్చు..
Advertisement

Vitamin B12 Veg Foods | మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరుకు, ఎర్ర రక్త క‌ణాల నిర్మాణానికి దోహ‌ద‌ప‌డుతుంది. అయితే ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఇది ఎక్కువ‌గా నాన్ వెజ్ ఆహారాల్లో ఉంటుంది. కానీ శాకాహారం మాత్ర‌మే తినేవారు ఈ విట‌మిన్ ను పొంద‌లేకపోతుంటారు. ఇక నాన్ వెజ్ తినేవారిలో సైతం ప‌లు వ్యాధుల కార‌ణంగా విట‌మిన్ బి12 లోపం ఏర్పడుతోంది. ముఖ్యంగా డ‌యాబెటిస్‌, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నాన్ వెజ్‌ను తిన్నా కూడా విట‌మిన్ బి12 లోపం వ‌స్తోంది. ఆయా వ్యాధుల‌కు వాడే మందులే ఇలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయ‌ని పోష‌కాహార నిపుణులు, వైద్యులు తెలియ‌జేస్తున్నారు. అయితే విట‌మిన్ బి12 లోపం ఉన్న‌వారు కేవ‌లం నాన్ వెజ్ ఆహారాల‌ను మాత్ర‌మే తినాల్సిన ప‌నిలేదు. ప‌లు ర‌కాల వెజ్ ఆహారాల్లోనూ ఈ పోష‌క ప‌దార్థం మ‌న‌కు ల‌భిస్తుంది. వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే విట‌మిన్ బి12 లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఆవు పాలు..

ఒక గ్లాస్ ఆవు పాల‌ను సేవిస్తే సుమారుగా 1.1 మైక్రోగ్రాముల మేర విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. మ‌న‌కు రోజుకు ఈ విట‌మిన్ 2.4 మైక్రోగ్రాముల మోతాదులో కావ‌ల్సి ఉంటుంది. అయితే ఒక గ్లాస్ ఆవు పాల‌ను సేవించ‌డం ద్వారా మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ బి12లో 45 శాతం మేర పొంద‌వ‌చ్చు. క‌నుక నాన్ వెజ్ తిన‌లేక‌పోతే ఆవు పాల‌ను రోజూ తాగ‌వ‌చ్చు. అయితే ఆవు పాల‌లో కాస్త ప‌సుపు క‌లిపి తాగితే విట‌మిన్ బి12ను మ‌న శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంద‌ని పోష‌కాహార వైద్యులు చెబుతున్నారు. సాధార‌ణంగా విట‌మిన్ బి12 ట్యాబ్లెట్ల‌ను వాడితే జీర్ణాశ‌యంలో ఉండే యాసిడ్ల కార‌ణంగా చాలా వ‌ర‌కు విట‌మిన్ ను శ‌రీరం శోషించుకోలేదు. క‌నుక అధిక డోసుల్లో ఈ ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి ఉంటుంది. కానీ ప‌సుపు క‌లిపిన ఆవు పాలను తాగితే అందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల కార‌ణంగా యాసిడ్ల ప్ర‌భావం త‌గ్గుతుంది. దీంతో విట‌మిన్ బి12ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. ఇలా విట‌మిన్ బి12ను స‌రిగ్గా పొంద‌వ‌చ్చు. దీంతో ఈ విట‌మిన్ లోపం త‌గ్గుతుంది.

పెరుగు..

పెరుగులోనూ విట‌మిన్ బి12 ఉంటుంది. ఒక క‌ప్పు మోతాదులో పెరుగును తింటే సుమారుగా 0.6 నుంచి 1.0 మైక్రోగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ బి12ను పొంద‌వ‌చ్చు. చాలా త‌క్కువ కొవ్వు ఉండే పెరుగులో ఎక్కువ మొత్తంలో విట‌మిన్ బి12 ఉంటుంది. కనుక కొవ్వులేని పెరుగును తినాల్సి ఉంటుంది. పెరుగు కాసేపు నిల్వ ఉంటే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా కార‌ణంగా అది పులుస్తుంది. ఈ క్ర‌మంలో అందులో విట‌మిన్ బి12 త‌యార‌వుతుంది. క‌నుక మ‌రీ పుల్ల‌గా కాకుండా కాస్తంత పుల్ల‌గా ఉండే పెరుగును తింటే ఇంకా మంచిది. ఇక పెరుగును తింటే విట‌మిన్ బి12 ల‌భించ‌డ‌మేకాదు, జీర్ణ‌ వ్య‌వ‌స్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. అల్స‌ర్లు, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

ప‌నీర్‌..

చీజ్‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. అయితే డ‌యాబెటిస్ లేదా గుండె జ‌బ్బులు ఉన్న‌వారు, అధికంగా కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న‌వారు, బ‌రువు అధికంగా ఉన్నా కూడా చీజ్‌ను వాడ‌కూడ‌దు. ఇక పాల‌తో తయారు చేసే ప‌నీర్‌ను తింటున్నా కూడా విట‌మిన్ బి12 అధిక మొత్తంలో ల‌భిస్తుంది. 100 గ్రాముల పనీర్‌ను తింటే సుమారుగా 0.7 నుంచి 0.8 మైక్రోగ్రాముల మేర విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. ప‌నీర్‌లో 18 నుంచి 20 గ్రాముల మేర ప్రోటీన్లు కూడా ఉంటాయి. క‌నుక దీన్ని తింటే ఓ వైపు విట‌మిన్ బి12తోపాటు మ‌రోవైపు ప్రోటీన్ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇవి కండ‌రాల నిర్మాణానికి స‌హాయం చేస్తాయి. శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. ఇలా ఆయా ఆహారాల‌ను తీసుకుంటే విట‌మిన్ బి12 లోపాన్ని తొల‌గించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement