Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
Supreme Court | ఉద్యోగార్ధులకు భారత సుప్రీంకోర్టు (Supreme Court) శుభవార్త అందించింది. గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ కేడర్‌లో జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
Supreme Court | త్రినేత్ర న్యూస్: ఉద్యోగార్ధులకు భారత సుప్రీంకోర్టు (Supreme Court) శుభవార్త అందించింది. గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ కేడర్‌లో జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఈ నెల 7 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి బేసిక్ పే కింద నెలకు రూ.35వేలకు పైగా గౌరవ వేతనం లభిస్తుంది.
పోస్టుపేరు: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA)
మొత్తం ఖాళీలు: 250
అర్హతలు: 2026 సెప్టెంబర్ 1 నాటికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు నిమిషానికి 35 పదాల (35 w.p.m.) ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ తప్పనిసరి. 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితిలో సడలింపునకు అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం: 4 దశల్లో ఉంటుంది. రాతపరీక్ష, టైపింగ్‌టెస్ట్, డిస్క్రిప్టివ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్: ఇది 100 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. జనరల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు, రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థ నిబంధనలు 15 ప్రశ్నలు, సుప్రీంకోర్టు రూల్స్ 2013 నుంచి 10 ప్రశ్నలు, సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ రూల్స్ 1961 నుంచి 10 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెజ్డ్కు సంబంధించినవి 15 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తంగా 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో సెకండ్ స్టేజ్(టైపింగ్ అండ్ డిస్క్రిప్టివ్)కు ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ టైపింగ్ టెస్ట్: 50 మార్కులు, 10 నిమిషాలు. అర్హత సాధించాలంటే 25 మార్కులు సాధించాలి. ఇంగ్లిషులో కనీసం 35 w.p.m. స్పీడ్ ఉండాలి.
డిస్క్రిప్టివ్ రాత పరీక్ష: ఇది 100 మార్కులకు ఉంటుంది. 2 గంటల్లో పూర్తిచేయాలి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రిసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాలిఫై మార్కులు 50. టైపింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
ఇంటర్వ్యూ: ఇది 25 మార్కులకు ఉంటుంది. క్వాలిఫై మార్కులు-13 (ఇంటర్వ్యూకి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీసైనికోద్యోగులు, దివ్యాంగులకు రూ.750
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 7
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 28
ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ డేట్ (తాత్కాలికం): నవంబర్ 20
ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్
టైపింగ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ: ఢిల్లీ
వెబ్‌సైట్: http://www.sci.gov.in/
సంబంధిత వార్తలు

DSSSB | జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో 641 ఉద్యోగాలు.. ఈ నెల 6 నుంచి దరఖాస్తులు..
అక్టోబర్ 3, 2026

ECIL | ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు.. తెలంగాణకు చెందినవారే అర్హులు
అక్టోబర్ 2, 2026

One Nation One Election JPC | ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
- ●Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- ●తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’
- ●Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Faruk G Patel Success Story | ఆటో నడిపాడు, పిజ్జాహట్‌లో పని చేశాడు.. నేడు రూ.10,964 కోట్ల సామ్రాజ్యం
- ●Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ

Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’

Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?



