Nose Bleeding | వేసవిలో చాలా మందికి ఎదురయ్యే ముక్కు రక్తస్రావం సమస్య.. కారణాలేంటి..?
Nose Bleeding | వేసవిలో సాధారణంగా చాలా మందికి ఎదురయ్యే సమస్యల్లో ఎపిస్టాక్సిస్ ఒకటి. అంటే ముక్కు నుంచి రక్తస్రావం అవడం. చాలా వరకు ఇది ప్రమాదకరం కాకపోయినా, తరచూ సంభవిస్తే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Nose Bleeding | వేసవిలో సాధారణంగా చాలా మందికి ఎదురయ్యే సమస్యల్లో ఎపిస్టాక్సిస్ ఒకటి. అంటే ముక్కు నుంచి రక్తస్రావం అవడం. చాలా వరకు ఇది ప్రమాదకరం కాకపోయినా, తరచూ సంభవిస్తే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అంతర్జాతీయ ఈఎన్టీ పరిశోధనల ప్రకారం ముక్కు రక్తస్రావం ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ ఈఎన్టీ అత్యవసర పరిస్థితుల్లో ఒకటిగా ఉంది. ఇది ఏ కాలంలోనైనా సంభవించే అవకాశాలు ఉంటాయి. కానీ తీవ్రమైన వేడి, వేసవికాలంలో ఎక్కువగా వస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్, ధూళి, ఎయిర్ కండిషనర్ల అధిక వినియోగం వల్ల ముక్కు లోపలి భాగంలో ఇర్రిటేషన్‌కు దారితీస్తుంది. ఇవి ముక్కులోని సున్నితమైన రక్తనాళాలను బలహీనపరచి సులభంగా చిట్లేలా చేస్తాయి. దీంతో రక్త స్రావం అవుతుంది.
రక్తనాళాలు చిట్లిపోయి..
వేసవిలో ముక్కు రక్తస్రావం ఎక్కువగా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం నివారణకు కీలకం. ఎక్కువ కేసులు తేలికపాటి అయినప్పటికీ, తరచూ లేదా తీవ్రంగా జరిగితే అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముక్కులోని చిన్న రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. ఇవి చాలా సున్నితమైనవిగా ఉండటంతో కొన్ని పరిస్థితుల్లో సులభంగా దెబ్బతింటాయి. ఎండగా, వేడిగా ఉన్న గాలి ప్రధాన కారణాల్లో ఒకటి. డ్రై ఎయిర్ కారణంగా ముక్కు లోపలి పొర పగిలిపోతుంది, దీంతో రక్తస్రావం సంభవించే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా హీట్‌వేవ్ సమయంలో గాల్లో తేమ తగ్గిపోతుంది. ఇళ్లలో ఎయిర్ కండిషనర్ల వినియోగం కూడా గాలిని మరింత పొడిగా మారుస్తుంది. పరిశోధనల ప్రకారం తేమ తగ్గితే ముక్కు రక్తస్రావం కేసులు పెరుగుతాయి.
డీహైడ్రేషన్ ముఖ్య కారణం..
డీహైడ్రేషన్ కూడా మరో ముఖ్య కారణం. వేసవిలో అధిక చెమట కారణంగా శరీరంలో తేమ తగ్గిపోతుంది. ఇది ముక్కు లోపలి పొరను కూడా పొడిగా అయ్యేలా చేస్తుంది. ఈ పొర ఎండిపోతే అది బలహీనమై, చిన్న ఇర్రిటేషన్‌కే రక్తస్రావం జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు రక్తనాళాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరిస్తాయి, వాటి గోడలు బలహీనమవుతాయి. దీంతో చిన్న కారణాలకే అవి చిట్లిపోతాయి. వేసవిలో ధూళి తుఫాన్లు, కాలుష్యం, పుప్పొడి వంటి అలర్జెన్లు పెరుగుతాయి. ఇవి ముక్కులో వాపులకు దారితీస్తాయి. తరచూ తుమ్మడం, ముక్కు తుడుచుకోవడం వల్ల కూడా రక్తస్రావం సంభవిస్తుంది. అలర్జిక్ రైనైటిస్, ఇన్ఫెక్షన్లు కూడా ఈ సమస్యను పెంచుతాయి. ఎయిర్ కండిషనర్ల అధిక వినియోగం కూడా సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఇవి గాల్లో తేమను తగ్గించి ముక్కు లోపలి భాగాన్ని పొడిగా మారుస్తాయి. నగర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

వేళ్లు పెట్టి తిప్పొద్దు..
ముక్కు లోపల వేళ్లు పెట్టి తిప్పడం లేదా రుద్దడం వంటి అలవాట్లు కూడా రక్త స్రావానికి కారణమవుతాయి. ఎండిపోయి పొడిగా మారిన ముక్కు లోపలి పొర దురద కలిగించడంతో, పిల్లలు, పెద్దలు తెలియక ముక్కును రుద్దుతారు. దీనివల్ల రక్తనాళాలు చిట్లిపోతాయి. ఈ సమస్య ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ పిల్లలు, వృద్ధులు, అలర్జీలు ఉన్నవారు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు, రక్తాన్ని పలుచా చేసే (బ్లడ్ థిన్నింగ్) మందులు వాడేవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. సాధారణంగా ముక్కు రక్తస్రావం కొన్ని నిమిషాల్లో ఆగిపోతుంది. అయితే 20 నిమిషాలకంటే ఎక్కువ కొనసాగితే, తరచూ వస్తే, అధిక రక్తస్రావం ఉంటే, గాయం తర్వాత వస్తే లేదా తలనిర్బంధం, బలహీనత ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నివారణ సులభమే..
ఇక దీని నివారణ చాలా సులభం. ఎక్కువగా నీరు తాగడం ద్వారా శరీరంలో తేమను నిలుపుకోవాలి. సాలైన్ స్ప్రేలు లేదా పెట్రోలియం జెల్లీతో ముక్కు లోపలి భాగాన్ని తేమగా ఉంచాలి. ఎయిర్ కండిషనర్ వినియోగాన్ని నియంత్రించాలి. ధూళి, వేడి నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించాలి. ముక్కును రుద్దడం లేదా వేళ్లు పెట్టి తిప్పడం నివారించాలి. అలర్జీలకు వైద్య సలహా తీసుకోవాలి. ముక్కు రక్తస్రావం జరిగితే నేరుగా కూర్చొని కొంచెం ముందుకు వంగాలి. ముక్కు మెత్తని భాగాన్ని 10 నిమిషాల పాటు నొక్కి పట్టుకోవాలి. వెనక్కి వంగకూడదు, పడుకోవద్దు. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. వేసవిలో ముక్కు రక్తస్రావం సాధారణ సమస్య అయినప్పటికీ దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఎండ గాలి, డీహైడ్రేషన్, ధూళి, జీవనశైలి అలవాట్లు కారణమవుతాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. తరచూ లేదా తీవ్రంగా జరిగే సందర్భాల్లో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

IMD | రాబోయే ఐదు రోజులు గరిష్ఠ స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు..
మే 19, 2026

KP Vivekananda | నీళ్లు లేవంటున్నవ్.. అసలు నువ్వే లేకుంటే దరిద్రం పోయేది: ఎమ్మల్యే వివేకానంద
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



