త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Egg White | కాలుష్య నీటి శుద్ధికి గుడ్డు తెల్లసొనలోని ప్రోటీన్ పరిష్కారం… సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

Egg White | కోడిగుడ్డు తెల్ల సొన‌లో ఉండే ఓవాల్బుమిన్ అనే ప్ర‌ధాన ప్రోటీన్ క‌లుషిత నీటిలో ఉండే పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ను (PFAS) స‌మ‌ర్థ‌వంతంగా బంధించి తొల‌గిస్తుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. దీని వ‌ల్ల చాలా కాలం పాటు ప‌ర్యావ‌ర‌ణంలోనే నిలిచిపోయే ర‌సాయ‌నాల‌ను తొల‌గించ‌డానికి విస్తృతంగా ఉప‌యోగించ‌గ‌ల ప‌దార్థాన్ని అభివృద్ధి చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

S

Lifestyle | Published On Mar 14, 2026, 4.09 pm IST

Egg White | కాలుష్య నీటి శుద్ధికి గుడ్డు తెల్లసొనలోని ప్రోటీన్ పరిష్కారం… సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డి..
Advertisement

Egg White | కోడిగుడ్డు తెల్ల సొన‌లో ఉండే ఓవాల్బుమిన్ అనే ప్ర‌ధాన ప్రోటీన్ క‌లుషిత నీటిలో ఉండే పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ను (PFAS) స‌మ‌ర్థ‌వంతంగా బంధించి తొల‌గిస్తుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. దీని వ‌ల్ల చాలా కాలం పాటు ప‌ర్యావ‌ర‌ణంలోనే నిలిచిపోయే ర‌సాయ‌నాల‌ను తొల‌గించ‌డానికి విస్తృతంగా ఉప‌యోగించ‌గ‌ల ప‌దార్థాన్ని అభివృద్ధి చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ను సాధార‌ణంగా నాన్‌స్టిక్ వంట పాత్ర‌లు, వాట‌ర్ ప్రూఫ్ వ‌స్త్రాలు వంటి అనేక ఉత్ప‌త్తుల్లో ఉప‌యోగిస్తారు. ఇవి ప‌ర్యావ‌ర‌ణ‌లో, మ‌నిషి శ‌రీరంలో చాలా కాలం పాటు నిలిచిపోతాయి. అందుక‌నే వీటిని ఫరెవ‌ర్ కెమిక‌ల్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప‌దార్థాల‌కు మ‌నిషి శ‌రీరం గురైతే క్యాన్స‌ర్‌, లివ‌ర్ డ్యామేజ్‌, ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌గ్గ‌డం వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు క‌లుగుతాయ‌ని అధ్య‌య‌నాల్లో తేలింది.

నీటి శుద్ధికి బ‌యో ఆధారిత ప‌దార్థాల అభివృద్ధి..

నార్త్ డ‌కోటా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన అచింత్య బెజ్బ‌రువా, లోవా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన వెంజీ షియా నేతృత్వంలోని ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు. ఓవాల్బుమిన్ ఓ స‌హ‌జ క్యారియ‌ర్ ప్రోటీన్‌లా ప‌నిచేస్తుందని వారు గుర్తించారు. ఇది పాలీఫ్లోరో ఆల్కైల్ అణువుల‌ను బంధించి వాటి చుట్టూ అంటి పెట్టుకుని స్థిర‌మైన స‌మ్మేళ‌నంగా బంధించి ఉంచ‌గ‌ల‌ద‌ని ప‌రిశోధ‌న‌లో గుర్తించారు. ఈ బంధించే ల‌క్ష‌ణాన్ని ఉప‌యోగించి నీటి శుద్ధి వ్య‌వ‌స్థ‌ల్లో పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ను తొల‌గించ‌డానికి బ‌యో ఆధారిత ప‌దార్థాల‌ను అభివృద్ధి చేయ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

కోళ్ల పెంప‌క ప‌రిశ్ర‌మ‌కు కొత్త ఆదాయ అవ‌కాశం..

ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్న ప్రొఫెస‌ర్ బెజ్బ‌రువా మాట్లాడుతూ ఈ ప‌రిశోధ‌న వల్ల అత్యంత సుల‌భంగా, ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేసే బయో ఆధారిత అడ్సార్బెంట్‌ను అభివృద్ధి చేయ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింద‌ని, దీని వ‌ల్ల కోళ్ల పెంప‌క ప‌రిశ్ర‌మ‌కు కొత్త ఆదాయ అవ‌కాశాలు కూడా ఏర్ప‌డుతాయ‌ని అన్నారు. ఈ ప‌రిశోధ‌న తాలూకు వివ‌రాల‌ను సెల్ రిపోర్ట్స్ ఫిజిక‌ల్ సైన్స్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. ఇందులో మాలిక్యుల‌ర్ మోడ‌లింగ్‌, కంప్యూటేష‌న‌ల్ సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగించి ఓవాల్బుమిన్, పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ మ‌ధ్య ప‌రస్ప‌ర చ‌ర్య‌ల‌ను అణు స్థాయిలో విశ్లేషించారు. ఈ ప‌రిశోధ‌న‌లో అర్జినిన్‌, లైసిన్ వంటి ముఖ్య‌మైన అమైనో ఆమ్లాలు కాలుష్య ప‌దార్థాల‌కు ప్ర‌ధాన బంధ‌న కేంద్రాలుగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.

అత్యంత చ‌వ‌కైన శుద్ధి ప‌ద్ధ‌తి..

సంప్ర‌దాయ పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ శుద్ధి ప‌ద్ధ‌తులు చాలా ఖ‌రీదైన‌విగా ఉంటాయ‌ని, యాక్టివేటెడ్ కార్బ‌న్, మెంబ్రేన్ ఫిల్ట‌రేష‌న్ ఆ కోవ‌కే చెందుతాయ‌ని అధ్య‌య‌నంలో పాల్గొన్న ప్రొఫెస‌ర్ షియా తెలిపారు. గుడ్డు నుంచి ల‌భించే ప్రోటీన్ల‌ను ఉప‌యోగించే అవ‌కాశం త‌క్కువ ఖ‌ర్చుతో కూడి ఉంటుంద‌ని, ప‌ర్యావ‌ర‌ణ హితంగా కూడా ఉంటుంద‌ని తెలిపారు. విస్తృతంగా ల‌భించే స‌హ‌జ ప్రోటీన్ల‌ను బ‌యో-అడ్సార్బెంట్లుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో అనుకూలంగా ఉంటుంద‌ని అన్నారు. వివిధ ప‌రిస్థితుల్లో ఓవాల్బుమిన్ 7 ర‌కాల పాలీఫ్లోరో ఆల్కైల్ ప‌దార్థాల‌ను బంధించ‌గ‌ల‌ద‌ని కూడా ప‌రిశోధ‌న‌లో తేలిన‌ట్లు వివ‌రించారు. నార్త్ డ‌కోటా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన డాక్టోర‌ల్ విద్యార్థిని షిర్సా మ‌జుందార్ మాట్లాడుతూ సాధార‌ణ కోడిగుడ్డులోని తెల్ల‌సొన ఇంత‌టి శ‌క్తివంతమైన ప‌ర్యావ‌ర‌ణ ఉప‌యోగాన్ని అందిస్తుందనేది చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌ల‌కు గొప్ప ప‌రిష్కారం మ‌న ఫ్రిజ్‌లోనే ఉంద‌ని అన్నారు.

Advertisement
Advertisement