Lemon Water For High BP | నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల హైబీపీ తగ్గుతుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
Lemon Water For High BP | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా హైబీపీ వస్తుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
Lemon Water For High BP | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా హైబీపీ వస్తుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనతోపాటు అస్తవ్యవస్తమైన జీవన విధానం ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైబీపీ సైలెంట్ కిల్లర్‌గా మారిందని వారు అంటున్నారు. హైబీపీ వల్ల గుండె పోటు సంభవిస్తోందని, ఇది ఉన్నట్లు చాలా మందికి తెలియడం లేదని, ప్రతి ఒక్కరు కచ్చితంగా బీపీ, షుగర్ టెస్టులను తరచూ తప్పనిసరిగా చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఈ చిట్కా పనిచేస్తుందా..?
అయితే హైబీపీ ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు డాక్టర్లు ఇచ్చిన మందులను వాడడంతోపాటు అనేక చిట్కాలను కూడా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల హైబీపీ తగ్గుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఆ చిట్కాను కూడా తరచూ పాటిస్తున్నారు. అయితే నిజంగానే ఈ చిట్కా పనిచేస్తుందా..? నిమ్మకాయ నీళ్లను తాగితే బీపీ తగ్గుతుందా..? అనే ప్రశ్నలకు వైద్యులు సమాధానాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పారెల్‌లోని గ్లెనీగల్స్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ కార్డియో వాస్కులర్, థోరాసిక్ సర్జన్, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ స్వరూప్ స్వరాజ్ పాల్ ఈ విషయంపై మాట్లాడుతూ నిమ్మకాయల్లో అనేక పోషకాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా నిమ్మరసంలో విటమిన్ సి, సిట్రస్ ఫ్లేవనాయిడ్స్, ఇతర సమ్మేళనాలు అధికంగా ఉంటాయన్నారు. అందువల్ల నిమ్మరసం కలిపిన నీళ్లను తాగితే రక్త నాళాలు వెడల్పుగా మారి రక్త సరఫరా మెరుగు పడుతుందని తెలిపారు. దీని వల్ల బీపీ కాస్త తగ్గుతుందని అన్నారు.
ఇక నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల రక్త నాళాల ఆరోగ్యానికి కాస్త ప్రయోజనం ఉంటుందని, బీపీ కాస్త తగ్గుతుందని, అలా అని చెప్పి హైబీపీ సమస్య పూర్తిగా తగ్గదని డాక్టర్ పాల్ అన్నారు. అందువల్ల హైబీపీ ఉన్నవారు నిమ్మకాయ నీళ్లను అప్పుడప్పుడు తాగడం మంచిదేనని, కానీ రోజూ తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. నిమ్మకాయ నీళ్లను తాగినప్పటికీ అవి కొంత వరకు మాత్రమే ఉపశమనం లభించేలా చేస్తాయని, సమస్య పూర్తిగా తగ్గదని అన్నారు. కనుక హైబీపీ ఉన్నవారు బీపీ మందులను కచ్చితంగా క్రమం తప్పకుండా వాడాల్సిందేనని సూచించారు. నిమ్మకాయ నీళ్లు బీపీ మందులకు ప్రత్యామ్నాయం కాదని, అలా ఎన్నడూ భావించవద్దని, అలా భావించి మందులను వాడడం మానేస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయని తెలిపారు. బీపీ తగ్గేందుకు అనేక అంశాలు కారణమవుతాయని, సరైన ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రించడం, నీళ్లను సరిగ్గా తాగడం, వ్యాయామం చేయడం వంటివి కూడా బీపీ తగ్గేందుకు దోహదం చేస్తాయని, కనుక కేవలం నిమ్మకాయ నీళ్లపై ఆధార పడకూడదని, అవి కొంత మేరకే ఉపశమనాన్ని అందిస్తాయని స్పష్టం చేశారు. పూర్తిగా సమస్య తగ్గదని, అదుపులో మాత్రమే ఉంటుందని, అందుకు ఆయా సూచనలను పాటించాలని అన్నారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



