Diabetes | కేవలం HbA1c లెవల్స్‌నే చూస్తే నష్టమే.. డయాబెటిస్ చికిత్సపై లాన్సెట్ కీలక అధ్యయనం..
Diabetes | డయాబెటిస్ చికిత్సలో కీలకంగా భావించే HbA1c (గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) టెస్ట్ కచ్చితత్వంపై తాజాగా అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. లాన్సెట్ రీజినల్ హెల్త్ - సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం ఈ టెస్టు ఫలితాలు ప్రతి ఒక్కరికీ సరిగ్గా ఉండకపోవచ్చని తేలింది.
Diabetes | డయాబెటిస్ చికిత్సలో కీలకంగా భావించే HbA1c (గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) టెస్ట్ కచ్చితత్వంపై తాజాగా అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. లాన్సెట్ రీజినల్ హెల్త్ - సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం ఈ టెస్టు ఫలితాలు ప్రతి ఒక్కరికీ సరిగ్గా ఉండకపోవచ్చని తేలింది. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా), రక్త సంబంధిత జన్యు వ్యాధులు ఉన్నవారిలో HbA1c లెవల్స్ తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. HbA1c టెస్టు వల్ల రెండు నుంచి మూడు నెలల సగటున రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌కు ఎంత గ్లూకోజ్ అతుక్కుని ఉందో లెక్కించడం ద్వారా ఈ టెస్టును నిర్వహిస్తారు. అయితే ఇది అన్ని పరిస్థితుల్లోనూ సరైన లెవల్స్‌ను ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు.
కేవలం HbA1c లెవల్స్‌తోనే వ్యాధి నిర్దారణ వద్దు..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో నిర్వహించిన INDIAB అధ్యయనం ప్రకారం భారత్‌లో సుమారు 10.1 కోట్ల మంది డయాబెటిస్‌తో, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఇంతటి భారీ సంఖ్యలో రోగులు ఉన్న నేపథ్యంలో కేవలం HbA1c లెవల్స్ ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా డయాబెటిస్ వైద్య నిపుణుడు డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ HbA1c టెస్టును సులభంగా చేయవచ్చు, కాబట్టి విస్తృతంగా వాడుతున్నారు, కానీ కేవలం దీని మీద మాత్రమే ఆధారపడితే, చాలా మందిలో డయాబెటిస్ ను తప్పుగా గుర్తించే ప్రమాదం ఉంటుంది, దీని వల్ల వేరే వ్యాధులకు అవసరమైన చికిత్సను అందించడం ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది.. అని తెలిపారు.
రక్తహీనత ఉన్నవారిలో తప్పుగా HbA1c లెవల్స్..
ఇక నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5) ప్రకారం భారత్‌లో 57 శాతం మహిళలు, 25 శాతం పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల HbA1c ఫలితాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుందని తేలింది. అందువల్ల డయాబెటిస్ లేకపోయినప్పటికీ ఒకవేళ ఎవరైనా పేషెంట్లు సాధారణ పరీక్షల్లో భాగంగా HbA1c టెస్టును చేయించుకుంటే అప్పుడు తమకు ఉన్న రక్తహీనత కారణంగా ఆ లెవల్స్ తప్పుగా వచ్చే అవకాశం ఉంటుందని, దీంతో HbA1c టెస్టు ఆధారంగా డయాబెటిస్ ఉందని నిర్దారణకు వచ్చి చికిత్స అందిస్తే అప్పుడు తప్పుడు చికిత్స చేసినట్లు అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అసలు వ్యాధి రక్తహీనత లేదా దాని వెనుక ఉన్న ఇతర వ్యాధులకు చికిత్స అందించరని, తద్వారా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

G6PD లోపం ఉంటే డయాబెటిస్ నిర్దారణ కష్టమే..
ఇక ఈ విషయంలో ఉన్న మరో కోణాన్ని కూడా వైద్య నిపుణులు విశ్లేషించారు. డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ కోవిల్ మాట్లాడుతూ G6PD లోపం వంటి జన్యు సమస్యలు ఎర్ర రక్తకణాలు త్వరగా నశించడానికి కారణమవుతాయని అన్నారు. దీని వల్ల HbA1c తక్కువగా కనిపిస్తుందని, అయితే అప్పటికే ఆ రోగులకు డయాబెటిస్ గనక ఉంటే తక్కువగా ఉండే HbA1c లెవల్స్ కారణంగా చికిత్సను అందించరని, దీంతో డయాబెటిస్ ను గుర్తించకుండా మిగిలిపోయే అవకాశముందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో డయాబెటిస్ వ్యాధి ఉందని తెలిపే విషయం మరుగున పడుతుందని, తప్పుగా లేదా తక్కువగా వచ్చే HbA1c లెవల్స్ కారణంగా డయాబెటిస్ లేదని నిర్దారణకు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. దీని వల్ల డయాబెటిస్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా గుర్తించని కారణంగా వైద్యులు చికిత్స చేయరని, దీంతో దీర్ఘకాలంలో డయాబెటిస్ మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
ఇతర టెస్టులు కూడా అవసరం..
అధ్యయనం ప్రకారం, ఈ విధమైన తప్పు నిర్ధారణ వల్ల కొందరు రోగులు నాలుగేళ్ల వరకు సరైన చికిత్స లేకుండా అలాగే ఉండిపోతున్నారని తేలింది. ఇది గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు HbA1cతో పాటు ఇతర టెస్టులను కూడా చేయాలని, వాటిల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని, కేవలం HbA1c లెవల్స్ ఆధారంగా వ్యాధి ఉందా లేదా అనే నిర్దారణకు రావొద్దని సూచిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధి ఉందా లేదా అని నిర్దారణకు వచ్చేందుకు HbA1c తోపాటు పలు ఇతర టెస్టులను కూడా రోగులకు సూచించాలని వారు తెలిపారు. రోగులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT), సాధారణ రక్త పరీక్షలతో కలిపిన HbA1c, కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) వంటి టెస్టులను కూడా చేసుకున్నాక అన్ని ఫలితాలను బట్టి డయాబెటిస్ వ్యాధి నిర్దారణకు రావాలని చెప్పారు.
ఇక ఇదే విషయంపై ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ అనీమియా ఎక్కువగా ఉండే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో HbA1c లెవల్స్ వాస్తవ రక్తంలో చక్కెర స్థాయిలకు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. కాబట్టి డయాబెటిస్ నిర్ధారణకు బహుళ పరీక్షల ఆధారిత విధానం అవసరం అని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Wegovy Pill | ట్యాబ్లెట్తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
మే 14, 2026

Fake Weight Loss Medicine | మార్కెట్లో భారీ ఎత్తున నకిలీ వెయిట్‌లాస్ మెడిసిన్.. ప్రజలకు వైద్యుల హెచ్చరిక..
మే 1, 2026

Lipoprotein(a) | ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది..? ఈ ఒక్క టెస్ట్‌తో ముందే తెలిసిపోతుంది..
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



