త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Social Media | వాట్సాప్‌, ఫేస్‌బుక్ క‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్ తోనే ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా మాన‌సిక స‌మ‌స్య‌లు

Social Media | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్ వంటివి ప్ర‌జ‌ల మాన‌సిక ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయ‌ని, సామాజిక అనుబంధాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల‌తో పోలిస్తే ఆయా వేదిక‌లు ప్ర‌జ‌లకు మ‌రింత హానిక‌ర‌మ‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంట‌ర్ త‌న అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది.

S

Lifestyle | Published On Mar 21, 2026, 12.55 pm IST

Social Media | వాట్సాప్‌, ఫేస్‌బుక్ క‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్ తోనే ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా మాన‌సిక స‌మ‌స్య‌లు
Advertisement

Social Media | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్ వంటివి ప్ర‌జ‌ల మాన‌సిక ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయ‌ని, సామాజిక అనుబంధాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల‌తో పోలిస్తే ఆయా వేదిక‌లు ప్ర‌జ‌లకు మ‌రింత హానిక‌ర‌మ‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంట‌ర్ త‌న అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆ సెంట‌ర్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. వ‌ర‌ల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్‌లో భాగంగా ప్ర‌చురిత‌మైన ఆ అధ్య‌య‌నంలో, ఎక్కువ‌గా విజువ‌ల్‌, పాసివ్ వినియోగాన్ని ప్రోత్స‌హించే యాప్‌లు గ‌ణ‌నీయంగా ఎక్కువ ప్ర‌తికూల భావోద్వేగాల‌ను సృష్టిస్తున్నాయ‌ని పరిశోధ‌కులు గుర్తించారు.

ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తున్న ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌..

వాట్సాప్, ఫేస్‌బుక్ వినియోగం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల జీవ‌న సంతృప్తి, జీవితంపై మెరుగైన అంచనా, సానుకూల భావోద్వేగాల‌ను పెంచుతున్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. వాట్సాప్ వినియోగం ప్ర‌తికూల భావాల‌ను త‌గ్గిస్తుందని, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలోనూ స‌హాయ ప‌డుతుంద‌ని తెలిపారు. అయితే ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్ వినియోగం వ‌ల్ల ప్ర‌జ‌లు త‌క్కువ సంతోషంగా ఉంటున్నార‌ని, అలాగే వారి జీవితాల‌పై గ‌ణ‌నీయంగా అధిక ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డి అలాంటి భావోద్వేగాలు పెరుగుతున్నాయ‌ని, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నార‌ని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగం వ‌ల్ల జీవితంపై చాలా మంది అసంతృప్తిగా ఉంటున్నార‌ని అన్నారు. సామాజిక అనుబంధాల‌ను పెంపొందించే విధంగా ఉన్న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్ర‌జ‌ల‌కు మేలు చేసే విధంగా ఉన్నా, కొన్ని ప్లాట్‌ఫామ్‌లు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్, టిక్ టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌ల‌ను ప‌రిశోధ‌కులు ఆల్గోరిథ‌మిక్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా పేర్కొన్నారు. ఇవి ప్ర‌జ‌ల జీవితంపై అనుకూల ప్ర‌భావాన్ని చూపించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

సోష‌ల్ మీడియా వినియోగాన్ని త‌గ్గించాలి..

త‌మ అధ్య‌య‌నంలో వ‌చ్చిన ఫ‌లితాలు సామాజిక అనుబంధాల‌ను పెంచే ప్లాట్‌ఫామ్‌ల వాడ‌కాన్ని ప్రోత్స‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తున్నాయ‌ని అన్నారు. అయితే సోష‌ల్ మీడియాలో మ‌రీ అతిగా విహ‌రించ‌డం కూడా మంచిది కాద‌ని వారు తెలిపారు. రోజుకు ఒక గంట వ‌ర‌కు మాత్ర‌మే సోష‌ల్ మీడియా స‌మ‌యాన్ని ప‌రిమితం చేయాల‌ని సూచించారు. త‌క్కువగా సోష‌ల్ మీడియాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎక్కువ జీవ‌న సంతృప్తిని అందిస్తుంద‌ని వెల్ల‌డించారు. చాలా మంది ప్ర‌జ‌లు ఇత‌రుల‌ను చూసి తాము కూడా సోష‌ల్ మీడియాను అధికంగా వాడుతున్నామ‌ని చెబుతున్నార‌ని, అయితే సోష‌ల్ మీడియా వినియోగాన్ని త‌గ్గిస్తే మంచిద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నామ‌ని కూడా ప్ర‌జ‌లు తెలిపార‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాను అతిగా ఉప‌యోగించ‌డం త‌గ్గ‌డం లేద‌ని అన్నారు. ఈ అల‌వాటును చాలా వ‌ర‌కు త‌గ్గించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement