త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dental Treatment | డెంట‌ల్ ట్రీట్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

Dental Treatment | ప్ర‌స్తుత త‌రుణంలో వైద్య చికిత్స‌ల‌కు ఖ‌ర్చు ఎంత‌లా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. కేవలం సాధార‌ణ వైద్య చికిత్స‌ల‌కే కాదు, వివిధ వైద్య విభాగాల‌కు చెందిన చికిత్స‌ల్లోనూ ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకోవాలంటే ముందుగా ప్ర‌జ‌లు త‌మ ఆర్థిక స్థోమ‌త గురించి ఆలోచించుకోవాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

S

Lifestyle | Published On Feb 6, 2026, 10.35 am IST

Dental Treatment | డెంట‌ల్ ట్రీట్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!
Advertisement

Dental Treatment | ప్ర‌స్తుత త‌రుణంలో వైద్య చికిత్స‌ల‌కు ఖ‌ర్చు ఎంత‌లా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. కేవలం సాధార‌ణ వైద్య చికిత్స‌ల‌కే కాదు, వివిధ వైద్య విభాగాల‌కు చెందిన చికిత్స‌ల్లోనూ ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకోవాలంటే ముందుగా ప్ర‌జ‌లు త‌మ ఆర్థిక స్థోమ‌త గురించి ఆలోచించుకోవాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇదే విష‌య‌మై శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్ర‌ముఖ దంత వైద్య నిపుణుడు డాక్ట‌ర్ మార్క్ బుర్‌హెన్నే పేషెంట్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ముఖ్యంగా దంత వైద్యానికి ప్ర‌జ‌లు అధికంగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే దంత వైద్య‌ చికిత్స తీసుకునే ముందు కొన్ని విష‌యాల‌ను ప్ర‌తి ఒక్క‌రు ఆలోచించుకోవాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు.

ఈ ప్ర‌శ్న‌లు వేసుకోవాలి..

డాక్టర్ బుర్‌హెన్నే ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టులో ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దంత చికిత్స తీసుకునే ముందు ఎవ‌రైనా స‌రే త‌మ‌కు తాము ప‌లు ప్ర‌శ్న‌లు వేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఈ చికిత్స నిజంగానే అవ‌స‌ర‌మా, ఎంత ఖ‌ర్చు అవుతుంది, దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు, ఎలాంటి న‌ష్టాలు ఉంటాయి..?, సెకండ్ ఒపీనియ‌న్ తీసుకున్నారా..? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌ను ముందుగా ఎవ‌రికి వారు వేసుకుని అన్నింటికీ ఓకే అనుకుంటేనే ఆ త‌రువాతే చికిత్స తీసుకోవాల‌ని డాక్టర్ బుర్‌హెన్నే అన్నారు. చాలా మందికి దంత చికిత్స అవ‌స‌రం ఉండ‌డం లేద‌ని, చిన్న స‌మ‌స్య‌కు కూడా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వచ్చి అధిక ఫీజులు చెల్లించి చికిత్స తీసుకుంటున్నార‌ని అన్నారు. తాను పుట్టుక‌తో వ‌చ్చిన దంతాల‌ను ర‌క్షించాల‌నే సూత్రాన్ని పాటిస్తూ చికిత్స అందిస్తాన‌ని, పేషెంట్ల‌కు అవ‌స‌రం ఉంటే త‌ప్ప చికిత్స చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌హ‌జ దంత నిర్మాణాన్ని కాపాడుతూ చికిత్స అందించ‌డ‌మే నిజ‌మైన డెంటిస్ట్రీ అని డాక్టర్ బుర్‌హెన్నే పేర్కొన్నారు. దంత వైద్య చికిత్స‌లో రోగికి, డెంటిస్టుకు మ‌ధ్య పార‌ద‌ర్శ‌క‌మైన చ‌ర్చ ఉండాల‌న్నారు. దీని వ‌ల్ల అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఉత్త‌మ డెంటిస్ట్రీ అంటే.. డెంటిస్ట్రీ అవ‌స‌ర‌మే లేకుండా చేయ‌డం, స‌రైన డెంటిస్ట్ అయితే అద్భుత‌మైన చికిత్స చేయ‌డమే కాదు, మ‌ళ్లీ మ‌ళ్లీ చికిత్స చేయాల్సిన అవ‌స‌రం రాకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement