Fake Weight Loss Medicine | మార్కెట్‌లో భారీ ఎత్తున నకిలీ వెయిట్‌లాస్ మెడిసిన్.. ప్రజలకు వైద్యుల హెచ్చరిక..
Fake Weight Loss Medicine | ఆరోగ్య సంరక్షణలో పేషెంట్ సేఫ్టీ కీలకం అయినప్పటికీ, నకిలీ ఔషధాల పెరుగుదల ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. హర్యానాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మౌంజారో కేసులు ఈ సమస్యను మరింత ఎత్తి చూపిస్తున్నాయి.
Fake Weight Loss Medicine | ఆరోగ్య సంరక్షణలో పేషెంట్ సేఫ్టీ కీలకం అయినప్పటికీ, నకిలీ ఔషధాల పెరుగుదల ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. హర్యానాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మౌంజారో కేసులు ఈ సమస్యను మరింత ఎత్తి చూపిస్తున్నాయి. ప్రాణరక్షక మందులు కొనుగోలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని ఇది స్పష్టంగా గుర్తు చేస్తోంది. జర్నల్ ఆఫ్ మెడిసిన్ సర్జరీ అండ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం నకిలీ మౌంజారో ఔషధంలో టిర్జెపటైడ్ స్థానంలో ఇన్సులిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ తక్కువ ధరలో సులభంగా లభ్యమవడం దీనికి కారణం. డయాబెటిస్ లేని వ్యక్తులు అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకుంటే తీవ్రమైన హైపోగ్లైసీమియా ప్రమాదం ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని ఒక్కసారిగా తగ్గించి మెదడుకు అవసరమైన శక్తిని దూరం చేస్తుంది. దీనిని బ్రెయిన్ స్టార్వేషన్ గా కూడా పేర్కొంటారు. ఫలితంగా శాశ్వత న్యూరోలాజికల్ నష్టం లేదా హైపోగ్లైసీమిక్ కోమా వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.
అవి మా ఉత్పత్తులు కావు: ఎలి లిల్లీ
వినియోగదారులను రక్షించేందుకు హర్యానా స్టేట్ ఎఫ్‌డీఏ గురుగ్రామ్‌లో నిర్వహించిన ఆపరేషన్‌లో మౌంజారో పేరుతో విక్రయిస్తున్న నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. ఎలి లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) ఈ ఉత్పత్తులు తమవి కావని, తమ అధికారిక సరఫరా చెయిన్‌తో సంబంధం లేదని ధ్రువీకరించింది. సంస్థ అధ్యక్షుడు విన్సెలో టక్కర్ మాట్లాడుతూ నకిలీ మందులపై చర్యలు తీసుకుంటున్న హర్యానా అధికారుల కృషిని తాము అభినందిస్తున్నామని తెలిపారు. ఇది పేషెంట్ సేఫ్టీకి కీలకమని అన్నారు. తమ సంస్థ నకిలీ ఉత్పత్తులను అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని, ఇవి నాణ్యత నియంత్రణల ప్రకారం తయారు చేయబడవని, అందువల్ల రోగుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేశారు. రోగులు లిల్లీ ఉత్పత్తులను కేవలం అధికారిక డిస్ట్రిబ్యూటర్లు లేదా లైసెన్స్ పొందిన ఫార్మసీల ద్వారా మాత్రమే, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌తో కొనుగోలు చేయాలన్నారు. తమ టిర్జెపటైడ్ ఔషధం భారత్‌లో మౌంజారో, యూర్‌పీక్ అనే రెండు బ్రాండ్ పేర్లతో మాత్రమే లభిస్తుందని తెలిపారు.
ఏ పదార్థం తీసుకున్నారో గుర్తించడం కష్టం..
ఫార్మకోలాజికల్, తయారీ దృష్టికోణంలో నకిలీ మందులు అనేక ప్రమాదాలను కలిగిస్తాయి. నిజమైన మందులను కఠిన నాణ్యత నియంత్రణలతో తయారు చేస్తారు. ప్రతి మైక్రోగ్రామ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్ కచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. డాక్టర్ భాను మిశ్రా (ఫోర్టిస్ హాస్పిటల్, షాలిమార్ బాగ్) తెలిపిన ప్రకారం నకిలీ మందులు నియంత్రణ వ్యవస్థలకు లోబడవని, క్లినికల్ టెస్టింగ్ లేకుండా తయారవుతాయని, ఫలితంగా రోగులు ఏ పదార్థం తీసుకుంటున్నారో తెలియదని అన్నారు. ఇది ప్రమాదకరమైన బ్లడ్ షుగర్ మార్పులకు దారితీస్తుందన్నారు. ఎక్కువ లేదా తక్కువ మోతాదు ఎలా తీసుకున్నా సరే నకిలీ మందులు ప్రమాదరమేనని, బ్యాక్టీరియా, హెవీ మెటల్స్ లేదా ప్రమాదకర రసాయనాలు ఉంటే ప్రాణాలకు మరింత ముప్పు ఏర్పడుతుందని అన్నారు. అసలు మందు స్థానంలో తక్కువ ధర కలిగిన ఇతర మందులను ఉపయోగిస్తారని, ఇది అలర్జీ లేదా ప్రమాదకర రియాక్షన్లకు దారితీస్తుందని తెలిపారు.

ఈ సూచనలు పాటించాలి..
నకిలీ ఔషధాలను తీసుకోకుండా రోగులు తమను తాము రక్షించుకోవడంతోపాటు అవసరం అయితే సంరక్షకులు కూడా అందుకు సహాయం చేయాలి. మౌంజారో లేదా యూర్‌పీక్ పేర్లకు భిన్నంగా ఏదైనా మందు అందిస్తే వెంటనే అనుమానం వ్యక్తం చేయాలి. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. లైసెన్స్ లేని ఆన్‌లైన్ ఫార్మసీలు లేదా బ్లాక్ మార్కెట్ లో మందులను కొనకూడదు. ప్యాకేజింగ్ లో మార్పులు, తెరిచిన సీల్స్, టేప్, దెబ్బతిన్న బాక్స్ వంటివి కనిపిస్తే తీసుకోకూడదు. ప్యాక్‌పై డేటా లేకపోవడం, బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీలను ముద్రించకపోవడం కూడా అనుమానాస్పదమే. స్పెల్లింగ్ తప్పులు, అనుమానాస్పద లోగోలు ఉన్నా కూడా అనుమానించాలి.
అప్రమత్తతే ముఖ్యం..
డాక్టర్ సలహా లేకుండా మందులు కొనడం ప్రమాదకరం. ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మందులను కొనాలి. లైసెన్స్ పొందిన ఫార్మసీలు మాత్రమే సురక్షిత సరఫరా చెయిన్‌లో భాగంగా ఉంటాయి. హర్యానా అధికారుల చర్యలు ప్రశంసనీయం అయినప్పటికీ, జాగ్రత్త వహించాల్సిన బాధ్యత వినియోగదారులపై కూడా ఉంది. నకిలీ మందుల ముప్పు నుంచి రక్షించుకోవాలంటే అధికారిక మార్గాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. అనుమానాస్పద ఉత్పత్తుల గురించి వెంటనే అధికారులకు తెలియజేయాలి. ఆరోగ్యం అత్యంత విలువైనది. చౌకగా లేదా సులభంగా లభిస్తోందని నమ్మి ప్రమాదంలో పడవద్దు. జాగ్రత్తగా ఉండాలి, సరైన మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి.
సంబంధిత వార్తలు

Wegovy Pill | ట్యాబ్లెట్తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
మే 14, 2026

Green Rice | గ్రీన్ రైస్ అనే బియ్యం రకంలో ఆరోగ్యకరమైన కొవ్వులు.. గుర్తించిన శాస్త్రవేత్తలు..
ఏప్రిల్ 8, 2026

Dapagliflozin | మధుమేహ చికిత్సకు కొత్త జనరిక్ వెర్షన్ ఔషధం.. ఆమోదించిన అమెరికా ఎఫ్‌డీఏ..
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



