Ozempic | జీఎల్పీ-1 మందులతో కంటి చూపు కోల్పోయే ప్రమాదం.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరిక..
Ozempic | బరువు తగ్గేందుకు, మధుమేహం నియంత్రణకు ఉపయోగించే ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో వంటి ప్రముఖ మందులపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ మందులు తీసుకునే వారిలో అరుదైన కంటి సమస్య అయిన నాన్-ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (ఎన్ఏఐఓఎన్) వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపింది.
Ozempic | బరువు తగ్గేందుకు, మధుమేహం నియంత్రణకు ఉపయోగించే ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో వంటి ప్రముఖ మందులపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ మందులు తీసుకునే వారిలో అరుదైన కంటి సమస్య అయిన నాన్-ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (ఎన్ఏఐఓఎన్) వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపింది. ఈ సమస్య కారణంగా అకస్మాత్తుగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా దృష్టి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
కంటిలోని ఆప్టిక్ నర్వ్‌కు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎన్ఏఐఓఎన్ సమస్య ఏర్పడుతుంది. ఈ నరం కళ్ల నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఒక కంటిలో అకస్మాత్తుగా, నొప్పి లేకుండా చూపు మందగించడం లేదా పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా నిద్రలేచినప్పుడు అకస్మాత్తుగా చూపు మసకబారడం, కళ్ల ముందు అస్పష్టమైన మచ్చలు కనిపించడం, సొరంగం గుండా చూస్తున్నట్లుగా దృష్టి పరిమితం కావడం, రంగులను గుర్తించడంలో మార్పులు, మధ్యభాగంలోని వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఎఫ్‌డీఏ సూచించింది. ఇప్పటికే ఈ సమస్య బారినపడిన వారు తమ మందుల వినియోగాన్ని కొనసాగించాలా, నిలిపివేయాలా అనే విషయాన్ని వైద్యులతో చర్చించాలని తెలిపింది.
అధ్యయనాల్లో ఏం తేలింది..?
ఎఫ్‌డీఏ నిర్వహించిన సమీక్షలో 1,34,253 మంది రోగులతో కూడిన 126 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను విశ్లేషించారు. వీరిలో 78,217 మంది జీఎల్పీ-1 ఆర్ఏ మందులు తీసుకోగా, మిగిలిన 56,036 మంది ప్లేసిబో లేదా ఇతర రక్తంలో చక్కెర నియంత్రణ మందులు తీసుకున్నారు. ఈ విశ్లేషణలో మొత్తం 15 అనుమానిత ఎన్ఏఐఓఎన్ కేసులను గుర్తించారు. వీటిలో 10 కేసులు జీఎల్పీ-1 మందులు తీసుకున్నవారిలో, ఐదు కేసులు ప్లేసిబో తీసుకున్నవారిలో నమోదయ్యాయి. ప్రతి లక్ష మంది వ్యక్తులు ఏడాది పాటు మందులు వినియోగించే కాలానికి సంబంధించి ఈ సమస్య సంభవించే రేటు జీఎల్పీ-1 మందుల వినియోగదారుల్లో 6.4గా ఉండగా, పోలిక కోసం పరిశీలించిన మరో వర్గంలో 3.8గా నమోదైంది. 2019 నుంచి 2024 మధ్య టైప్-2 మధుమేహ రోగుల వాస్తవ వైద్య సమాచారాన్ని కూడా ఎఫ్‌డీఏ పరిశీలించింది. ఎస్జీఎల్టీ-2 మందులతో పోలిస్తే గణాంకపరంగా గణనీయమైన ప్రమాద పెరుగుదల కనిపించలేదు. అయితే డీపీపీ-4 మందులతో పోల్చినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇతర పరిశీలనాత్మక అధ్యయనాల్లోనూ ప్రమాదం పెరిగినట్లు సంకేతాలు కనిపించాయి.
ఏయే మందులకు వర్తిస్తుంది..?
ఈ హెచ్చరిక సెమాగ్లుటైడ్ ఆధారిత ఓజెంపిక్, వెగోవీ, రైబెల్సస్, లిరాగ్లుటైడ్ ఆధారిత విక్టోజా, సాక్సెండా, డ్యులాగ్లుటైడ్ ఆధారిత ట్రూలిసిటీ, టిర్జెపటైడ్ ఆధారిత మౌంజారో, జెప్‌బౌండ్ మందులకు వర్తించనుంది. వీటన్నింటి ఔషధ లేబుళ్లలో ఎన్ఏఐఓఎన్ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని చేర్చాలని తయారీ సంస్థలను ఎఫ్‌డీఏ ఆదేశించింది. ఈ మందులను టైప్-2 మధుమేహం, ఊబకాయం చికిత్సతోపాటు కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత ప్రమాదాలు, కిడ్నీ వ్యాధుల నియంత్రణకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సమస్య లక్షణాలు కనిపించినవారు కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలని, ఎన్ఏఐఓఎన్ నిర్ధారణ అయిన రోగుల్లో చికిత్సను నిలిపివేయడాన్ని వైద్యులు పరిశీలించాలని ఎఫ్‌డీఏ సూచించింది. అయితే చికిత్స కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాదాల కంటే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు భావించిన సందర్భాల్లో తగిన నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

GLP-1 Medicine | జీఎల్పీ-1 మందులతో కంటి చూపును కోల్పోతారా.. వైద్య నిపుణుల స్పష్టత..
సెప్టెంబర్ 23, 2026

Ozempic | ఇక పెంపుడు జంతువులకు సైతం బరువు తగ్గించే మందులు.. పరిశోధన చేస్తున్న నిపుణులు..
జులై 21, 2026

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?
- ●Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!
- ●Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం
- ●Nvidia | ఎన్విడియా పతనం.. భారత ఇన్వెస్టర్లకు భారీ నష్టాల ముప్పు..?
- ●Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్‌పై అక్రమ కేసు పెట్టారు.. ఆయన మరణం దురదృష్టకరం
- ●Robbery | పోలీస్ స్టేషన్ పక్కనే బంగారం దుకాణం.. గోడను పగలగొట్టి ఆభరణాలు చోరీ..

Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?

Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!

Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం

Nvidia | ఎన్విడియా పతనం.. భారత ఇన్వెస్టర్లకు భారీ నష్టాల ముప్పు..?



