1 Kilo Body Weight | 1 కిలో బరువు తగ్గాలంటే ఎన్ని క్యాలరీలను ఖర్చు చేయాలంటే..?
1 Kilo Body Weight | బరువు తగ్గడం అన్నది నేటి తరుణంలో ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఎన్ని వ్యాయామాలు చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా బరువు తగ్గడం లేదని కొందరు వాపోతుంటారు. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ అధికంగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.
1 Kilo Body Weight | బరువు తగ్గడం అన్నది నేటి తరుణంలో ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఎన్ని వ్యాయామాలు చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా బరువు తగ్గడం లేదని కొందరు వాపోతుంటారు. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ అధికంగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇందుకు గాను డైట్‌లను పాటించడం, వ్యాయామాలు చేయడం చేస్తుంటారు. అయితే కొందరు కొన్ని కేజీల వరకు బరువు తగ్గితే చాలని లక్ష్యం పెట్టుకుని మరీ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక కేజీ బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే వాస్తవానికి పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం 1 కేజీ బరువు తగ్గడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకు చాలా క్యాలరీల శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రోజుకు 2500 క్యాలరీలు..
నిత్యం ఒక వ్యక్తి శారీరక శ్రమ ఎక్కువగా చేయకపోతే, కూర్చుని పనిచేసే ఉద్యోగం అయితే దాదాపుగా 2500 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. అయితే 3500 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తే మనం 1 పౌండు అంటే దాదాపుగా 0.45 కిలోగ్రాముల బరువు తగ్గుతాం. అంటే నిత్యం మనం 6000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటే అందులో 2500 క్యాలరీల శక్తిని శరీరం వినియోగించుకుంటే మిగిలిన 3500 క్యాలరీల శక్తి కొవ్వు కింద మన శరీరంలో మారుతుంది. అంటే 1 పౌండ్ బరువు పెరుగుతారన్నమాట.

1 కిలో బరువుకు..
అయితే మనకు కావల్సిన 2500 క్యాలరీల కన్నా తక్కువ మొత్తంలో క్యాలరీలు లభించేలా ఆహారాన్ని తీసుకుంటే క్యాలరీలకు కొరత ఏర్పడుతుంది కనుక శరీరం ఆ మొత్తాన్ని కొవ్వు నిల్వల నుంచి తీసుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. ఇక దాదాపుగా 7000 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తేనే గానీ మనం 1 కిలో బరువు తగ్గలేం. అయితే 7000 క్యాలరీల శక్తిని కరిగించాలంటే అందుకు మనకు చాలా సమయమే పడుతుంది. ఎలా అంటే.. ఒక గంట పాటు జాగింగ్ చేస్తే 400 క్యాలరీలు ఖర్చవుతాయి. అదే 17.5 గంటల పాటు జాగింగ్ చేస్తే 7000 క్యాలరీలను కరిగించవచ్చు. అయితే ఇలా నిరంతరాయంగా ఆగకుండా 17.5 గంటల పాటు జాగింగ్ చేయడం ఎవరి తరం కాదు. అంటే.. ఒక కిలో బరువును ఒక రోజులో తగ్గించుకోలేం. దీన్ని బట్టి చూస్తే మనం 1 కిలో బరువు తగ్గేందుకు గాను చాలా శ్రమించాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. మరి శరీరంలో అదనంగా ఉండే చాలా వరకు కిలోల బరువును తగ్గించుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకనే అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందని అందరికీ సులభంగా తెలిసి వస్తుంది.
కచ్చితంగా ఇలా చేయాలి..
మరి అంత కష్టంగా ఉన్నప్నుడు బరువును తగ్గించుకోవడం ఎలా..? అంటే.. నిత్యం మనకు సరాసరిగా 2500 క్యాలరీల శక్తి అవసరం అవుతుందిక కనుక మనం రోజూ అంతకన్నా తక్కువ మొత్తంలో క్యాలరీలు లభించేలా చూసుకోవాలి. అంటే మనం తినే ఆహారం తక్కువ క్యాలరీలు ఇచ్చేది అయి ఉండాలి. అప్పుడు మనకు రోజుకు కావల్సిన క్యాలరీలలో కొరత ఏర్పడుతుంది. దీంతో శరీరం ఆ లోటును భర్తీ చేసేందుకు కొవ్వుపై ఆధార పడుతుంది. ఇలా రోజూ జరిగితే శరీరం రోజూ కొవ్వును కాస్త పరిమాణంలో తగ్గిస్తూ వస్తుంది. దీని వల్ల రోజూ మనం వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతాం. అయితే ఇలా కచ్చితమైన డైట్‌ను పాటించే వారు రోజూ వ్యాయామం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. దీంతో బరువు త్వరగా తగ్గుతారు. ఈ విధంగా చాలా సునాయాసంగా బరువును తగ్గించుకోవచ్చు. కానీ కళ్లకు ఇంపుగా కనిపించే ఆహారం కనిపిస్తే తినకుండా ఉండలేకపోతారు. అలాంటి కోరికలను కంట్రోల్ చేసుకుంటేనే ఆ విధంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారు ముందుగా నోటికి తాళం వేయాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



