Holi Health Tips | హోలీ వేడుకల్లో నీటితో జాగ్రత్త.. వ్యాధులు ప్రబలే అవకాశం.. వైద్యుల సూచనలు..
Holi Health Tips | హోలీ పండుగ అంటే యువత, చిన్నారుల్లో ఎక్కువ సందడి నెలకొంటుంది. హోలీ పండుగ నాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఉత్సాహంగా గడుపుతారు. అయితే హోలీ వేడుకలు జరుపుకునేందుకు బాగానే ఉంటాయి.
Holi Health Tips | హోలీ పండుగ అంటే యువత, చిన్నారుల్లో ఎక్కువ సందడి నెలకొంటుంది. హోలీ పండుగ నాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఉత్సాహంగా గడుపుతారు. అయితే హోలీ వేడుకలు జరుపుకునేందుకు బాగానే ఉంటాయి. కానీ వేడుకల్లో భాగంగా అపరిశుభ్రంగా ఉండే నీటిని ఉపయోగిస్తే ఇబ్బందులు తప్పవని, పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందే ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సామూహికంగా జరిగే హోలీ వేడుకల్లో ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కలుషిత నీటి వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో గుంపులుగా ప్రజలు ఉండే చోట వ్యాధుల ప్రబలత అధికంగా ఉంటుందని వెల్లడైంది.
ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే అవకాశం..
హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే నీరు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆస్టర్ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ సుచిస్మిత రాజమాన్య వివరాలను వెల్లడించారు. హోలీ వేడుకల్లో వ్యాధులు సులభంగా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. బకెట్లు, బెలూన్లు, వాటర్ స్ప్రేయర్లతో ఆడడం ఆనందంగానే ఉంటుంది కానీ అపరిశుభ్రంగా ఉండే నటి వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. చాలా చోట్ల నీటిలో ఈ సమయంలో సాల్మొనెల్లా, షిగెల్లా, విబ్రియో తదితర బ్యాక్టీరియా అధికంగా ఉంటాయని, ఇవి టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి వ్యాధులను కలగజేస్తాయని తెలిపారు. ఇలాంటి నీటిని బకెట్లలో నిల్వ చేసి తిరిగి ఉపయోగిస్తే వ్యాధులు వచ్చే అవకాశం మరింత పెరుగుతుందన్నారు.

కృత్రిమ రంగులు వద్దు..
హోలీ పండుగ సందర్భంగా కృత్రిమ రంగులను వాడడం కూడా మంచిది కాదని డాక్టర్ రాజమాన్య తెలిపారు. ఆ రంగుల్లో భారీ లోహాలు లేదా పారిశ్రామిక-డై వంటివి ఉంటాయని, ఇవి నీటిలో కలిస్తే నోరు, ముక్కు లేదా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దీంతో చర్మ అలర్జీలు, కంటి ఇన్‌ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. హోలీ సందర్భంగా ముఖంపై నీళ్లను స్ప్రే చేసే సమయంలో అందులో ఉండే రంగులు లేదా కలుషిత నీరు ముక్కు లేదా నోట్లోకి వెళితే గ్యాస్ట్రో ఎంటరైటిస్, విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, చిన్నారులకు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా భారీగా ఒకే చోట గుమి గూడి హోలీ వేడుకలను నిర్వహించే చోట ప్రజలకు టైఫాయిడ్, హెపటైటిల్ ఎ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. కొన్ని కేసులు అత్యవసరంగా మారే ప్రమాదం ఉంటుందని కూడా హెచ్చరించారు.
ఈ సూచనలు పాటించాలి..
బెలూన్లు లేదా స్ప్రేయర్లు, వాటర్ గన్స్ వంటివి శుభ్రం చేయకుండా వాడితే బ్యాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్లను కలగజేస్తాయని, చిన్నారులు వీటిని అధికంగా ఉపయోగిస్తే ముప్పు మరింత ఎక్కువగా ఉంంటుందని అన్నారు. హోలీ సందర్భంగా వేడుకల్లో పాల్గొనేవారు శుభ్రమైన నీళ్లను ఉపయోగించాలని, తెలియని చోట నీళ్లను తీసుకుని ఉపయోగించకూడదని తెలిపారు. నీళ్లను మింగకూడదని, హోలీ ఆడిన తరువాత నోరు, ముక్కు వంటి భాగాలను శుభ్రమైన నీటితో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. పిల్లలను పెద్దలు పర్యవేక్షించాలని చెప్పారు. హోలీ తరువాత దుస్తులను వెంటనే మార్చుకోవాలని, ఎక్కువ సేపు తడిగా ఉంటే ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు. చేతులను, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని, భోజనానికి ముందు చేతులను బాగా కడగాలని తెలిపారు. సురక్షితమైన, సహజసిద్ధమైన రంగులనే హోలీకి ఉపయోగించాలని, చర్మానికి హాని చేసే కృత్రిమ రంగులను వాడొద్దని అన్నారు.
కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆమె సూచించారు. నిరంతర విరేచనాలు, అధికంగా జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం రావడం, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం
జూన్ 19, 2026

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026

Liver Protection Supplements | రెగ్యులర్‌గా మందు తాగుతున్నారా? లివర్ పాడవకుండా ఈ 3 సప్లిమెంట్స్ వాడండి!
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
- ●PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..
- ●PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ
- ●Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
- ●Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ●Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ

Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు



