High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా ‘హైబీపీ’.. ఏటా 16 లక్షల మంది బలి
దేశంలో హైబీపీ (హైపర్ టెన్షన్) సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఏటా 16 లక్షల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఎయిమ్స్ వెల్లడించింది.
- దేశంలో మహమ్మారిలా 'హైబీపీ'
- 30 కోట్ల మంది బాధితులు
- లక్షణాలు లేకుండానే ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్
- టీబీ, మలేరియా, డెంగ్యూ, హెచ్ఐవీ మరణాలన్నింటినీ కలిపినా.. బీపీ మరణాలే అత్యధికం
- ఈ వ్యాధి పట్టణాల్లో 33 శాతం, గ్రామాల్లో 25 శాతం మందికి విస్తరణ
- న్యూఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ స్పష్టం
High BP Silent Killer India | త్రినేత్ర.న్యూస్ : భారతదేశంలో హైపర్‌టెన్షన్ (High BP) ఒక సైలెంట్ కిల్లర్‌గా (Silent Killer) మారిపోయింది. ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే దొంగ దెబ్బ తీస్తున్న ఈ వ్యాధి బారిన పడి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఏకంగా 16 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ ఈ సైలెంట్ డిసీజ్ గురించి పలు కలవరపెట్టే నిజాలను వెల్లడించారు.
అన్ని మరణాలకంటే ఇదే టాప్
మన దేశంలో సంభవిస్తున్న మరణాలకు అత్యంత ప్రధాన కారణం ఈ హైబీపీనే కావడం గమనార్హం. టీబీ (Tuberculosis), మలేరియా, డెంగ్యూ, హెచ్ఐవీ (HIV) వంటి ప్రమాదకర అంటువ్యాధుల వల్ల సంభవిస్తున్న మొత్తం మరణాల కంటే హైబీపీ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని డాక్టర్ అంబుజ్ రాయ్ స్పష్టం చేశారు. కేవలం టీబీ మరణాలతో పోలిస్తే హైబీపీ మరణాలు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
గ్రామాల్లోనూ బీపీ కష్టాలు
ఐసీఎంఆర్ (ICMR) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో దాదాపు 30 కోట్ల మంది (300 మిలియన్లు) హైపర్‌టెన్షన్‌తో (Hypertension) సహజీవనం చేస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం నగరాలకే పరిమితం కాలేదు. పట్టణ ప్రాంతాల్లో 33 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో సైతం 25 శాతం మందిలో ఈ సైలెంట్ కిల్లర్ విస్తరించడం ఆందోళన కలిగించే విషయం.
ఎందుకిది 'సైలెంట్ కిల్లర్'?
హైబీపీని 'సైలెంట్ డిసీజ్' (Silent disease) అని ఎందుకు అంటారంటే, చాలాసార్లు ఇది ఎలాంటి లక్షణాలను (Symptoms) బయటపెట్టదు. లోపల సమస్య ఉన్నట్లు రోగికి తెలిసేలోపే గుండె, కిడ్నీలు లేదా బ్రెయిన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయి సడెన్‌గా ప్రాణాల మీదకు వస్తుంది. ఇది సైలెంట్ డిసీజ్ మాత్రమే కాదు, చాలా డెడ్లీ డిసీజ్ (Deadly disease) అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలని, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- ●Iran America War | బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
- ●ఐరాసలో టర్కీ కాశ్మీర్ రాగం.. సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో ఢిల్లీ సమాధానం ఇవ్వనుందా ?
- ●Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Iran America War | బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

ఐరాసలో టర్కీ కాశ్మీర్ రాగం.. సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో ఢిల్లీ సమాధానం ఇవ్వనుందా ?

Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ






