త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Foods To Reduce High Cholesterol | కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారికి సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. రోజూ తినాలి..!

Foods To Reduce High Cholesterol | పూర్వం గుండె జ‌బ్బులు వ‌య‌స్సు మీద ప‌డిన వారిలో మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యుక్త వ‌య‌స్సులో ఉన్న వారు కూడా ఆ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ఒత్తిడి, సుదీర్ఘ ప‌నిగంట‌లు, అస్త‌వ్య‌స్త‌మైన ఆహార‌పు అల‌వాట్లు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా గుండె వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు.

S

Lifestyle | Published On Jan 17, 2026, 6.53 am IST

Foods To Reduce High Cholesterol | కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారికి సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. రోజూ తినాలి..!
Advertisement

Foods To Reduce High Cholesterol | పూర్వం గుండె జ‌బ్బులు వ‌య‌స్సు మీద ప‌డిన వారిలో మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యుక్త వ‌య‌స్సులో ఉన్న వారు కూడా ఆ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ఒత్తిడి, సుదీర్ఘ ప‌నిగంట‌లు, అస్త‌వ్య‌స్త‌మైన ఆహార‌పు అల‌వాట్లు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా గుండె వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. కార్డియాల‌జిస్టులు తెలిపిన ప్ర‌కారం, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు. మ‌న గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆహారాలే దోహ‌దం చేస్తాయ‌ని, మందుల‌తో తాత్కాలిక ఉప‌శ‌మనం మాత్ర‌మే ఉంటుంద‌ని అంటున్నారు. రోజువారి దిన‌చర్య‌లో భాగంగా ప‌లు ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటే వాటితో గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని, ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉంటుంద‌ని, అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ఫ‌రీదాబాద్‌లోని అమృత హాస్పిట‌ల్‌కు చెందిన కార్డియాల‌జీ విభాగం సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ ఆశిష్ కుమార్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ఓట్స్‌..

గుండె నిపుణులు తెలిపిన ప్ర‌కారం, ఓట్స్‌ను అత్యంత ఉత్త‌మ‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఒక‌టిగా సూచిస్తున్నారు. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఒక స‌హ‌జ‌సిద్ధ‌మైన ఫైబ‌ర్‌. మ‌న శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్‌కు అతుక్కుపోతుంది. దీని వ‌ల్ల కొలెస్ట్రాల్‌ సుల‌భంగా బ‌య‌ట‌కు పంపించ‌బ‌డుతుంది. ఇలా ఓట్స్ మ‌న‌కు మేలు చేస్తాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌) త‌గ్గి హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్‌) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉండ‌డ‌మే కాదు, జంక్ ఫుడ్ తిన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు. అయితే ఓట్స్‌ను నేరుగా అలాగే ఉడ‌క‌బెట్టి తింటే మంచిది. వీలుంటే పండ్ల‌ను క‌లుపుకోవ‌చ్చు. అయితే పాలు, చ‌క్కెరను క‌ల‌ప‌కూడ‌దు.

వాల్ న‌ట్స్‌..

వాల్ నట్స్ మ‌న గుండె ఆరోగ్యాన్ని ర‌క్షించ‌డంలో శ‌క్తివంతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే బాదంప‌ప్పును కూడా తిన‌వ‌చ్చు. వీటిల్లో విట‌మిన్ ఇ తోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఈక్ర‌మంలో ఈ రెండు ర‌కాల న‌ట్స్‌ను క‌లిపి రోజూ తింటుంటే వాపులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ర‌క్త నాళాలు వాపులు తగ్గి అవి వెడ‌ల్పుగా మారుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. ఇలా ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ క‌లిపి రోజుకు 8 న‌ట్స్ వ‌ర‌కు తింటుండాలి. దీని వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి.

ఆకుకూర‌లు..

పాల‌కూర‌, మెంతి ఆకులు, తోట‌కూర వంటి ఆకుకూర‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో పొటాషియం, స‌హ‌జ‌సిద్ధ‌మైన రూపంలో నైట్రేట్లు ఉంటాయి. ఇవి ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పుగా మారేలా చేస్తాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె సుల‌భంగా రక్తాన్ని పంపు చేస్తుంది. అలాగే ఉప్పు వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు సైతం త‌గ్గిపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇలా ఆయా ఆకుకూర‌ల‌ను కూడా రోజూ తింటుండాలి. ఈ విధంగా డైట్ పాటిస్తే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉండ‌డంతోపాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement