త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Foods To Reduce Cholesterol | కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించే 5 ఆహారాలు.. స్ప‌ష్టం చేసిన వైద్య నిపుణులు..

Foods To Reduce Cholesterol | వ‌ర‌ల్డ్ హార్ట్ ఫౌండేష‌న్ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది అధిక కొలెస్ట్రాల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 44 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో దాదాపు 24 శాతం గుండె సంబంధిత మరణాలకు ప్రధాన కారణం అధిక ఎల్‌డీఎల్ గా గుర్తించారు.

S

Lifestyle | Published On Jan 26, 2026, 11.03 am IST

Foods To Reduce Cholesterol | కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించే 5 ఆహారాలు.. స్ప‌ష్టం చేసిన వైద్య నిపుణులు..
Advertisement

Foods To Reduce Cholesterol | వ‌ర‌ల్డ్ హార్ట్ ఫౌండేష‌న్ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది అధిక కొలెస్ట్రాల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 44 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో దాదాపు 24 శాతం గుండె సంబంధిత మరణాలకు ప్రధాన కారణం అధిక ఎల్‌డీఎల్ గా గుర్తించారు. ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌. సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్టాల్స్ ఉంటాయి. ఒక‌టి ఎల్‌డీఎల్‌గా కాగా దీన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇంకొక‌టి హెచ్‌డీఎల్‌. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఎల్‌డీఎల్ స్థాయిలు త‌గ్గాలంటే మ‌న శ‌రీరంలో హెచ్‌డీఎల్ అధికంగా ఉండాలి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే పలు ఆహారాలు హెచ్‌డీఎల్ స్థాయిల‌ను పెంచేందుకు స‌హాయం చేస్తాయ‌ని ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ వైద్య నిపుణులురాలు డాక్ట‌ర్ అదితి శర్మ తెలిపారు. ఈ మేర‌కు ఆమె ఆయా వివ‌రాల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

యువ‌త‌లో అధికంగా..

యువతలో ఈ సమస్య తీవ్రంగా పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలు 40 ఏళ్ల తర్వాతే వస్తాయని భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే 20లు, 30ల్లోనే అధిక ఎల్‌డీఎల్ ఉన్న రోగులను నేను ప్రతి వారం చూస్తున్నాను. శుభవార్త ఏమిటంటే మన రోజువారీ ఆహారంలో సరైన ఎంపికలు చేస్తే కొలెస్ట్రాల్ స్థాయిల‌ని నిజంగా తగ్గించుకోవచ్చని డాక్టర్ అదితి పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఐదు సాధారణ భారతీయ ఆహారాలను ఆమె సూచించారు.

ఓట్స్‌..

మ‌న శ‌రీరంలోని ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు 5 భార‌తీయ ఆహారాలు ప‌నిచేస్తాయ‌ని ఆమె చెప్పారు. వాటిల్లో ఓట్స్ మొద‌టి స్థానంలో నిలుస్తాయి. వీటిలో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను పేగుల్లో బంధించి శరీరం నుంచి బయటకు పంపుతుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఎల్‌డీఎల్ స్థాయిలు 5-10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇసబ్గోల్ లేదా ప్సిలియం హస్క్ ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాల‌ని ఆమె చెప్పారు. సాధారణంగా మలబద్ధకానికి ఉపయోగించే ఈ పదార్థం పిత్తరసాన్ని బంధించి కాలేయం ఎక్కువ కొలెస్ట్రాల్ వినియోగించేలా చేస్తుంది. దీంతో రక్తంలోని ఎల్‌డీఎల్ స్థాయి తగ్గుతుంది. వైద్య మార్గదర్శకాలలో కూడా దీనిని సూచిస్తారు. ఇక బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కూడా ఎల్‌డీఎల్ త‌గ్గుతుంది. వీటిల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అపోబీ (ApoB) అనే హానికర కొలెస్ట్రాల్ కణాల సంఖ్యను తగ్గిస్తాయి.

కూర‌గాయ‌లు..

అలాగే ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలు బెండకాయ, సొరకాయ, వంకాయ, క్యారెట్, పాలకూరను కూడా తినాల‌ని ఆమె చెప్పారు. వీటిని తిన‌డం వ‌ల్ల పేగుల్లో కొలెస్ట్రాల్ తిరిగి శోషించకుండా అడ్డుకుంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను కూడా త‌గ్గిస్తాయి. ఇక చక్కెర లేకుండా గ్రీన్ టీని కూడా సేవించాల‌ని ఆమె సూచించారు. ఇందులో పాలీఫినాల్స్ ఉండటం వల్ల పేగుల్లో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో యాంటీఆక్సిడెంట్ల‌ ప్రభావాన్ని పెంచుతాయి. క‌నుక ప్రతిరోజూ తాగితే ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇలా ఆయా ఆహారాలు ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు స‌హాయం చేస్తాయి. అయితే ఆహారమే అంతిమ పరిష్కారం కాదని డాక్టర్ అదితి స్పష్టం చేశారు. మీ ఎల్‌డీఎల్ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంటే, లేదా మీకు డయాబెటిస్, హై బీపీ, పీసీఓఎస్, ఫ్యాటీ లివర్ లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే - కేవలం ఆహారం సరిపోదు. అలాంటి సందర్భాల్లో జీవనశైలి మార్పులు, మందులు రెండూ అవసరం, అని ఆమె హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement