త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weight Loss Mistakes | బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారా..? ఈ త‌ప్పులు చేయ‌కండి..!

Weight Loss Mistakes | అధిక బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది క‌ఠిన‌మైన డైట్‌ను పాటిస్తుంటారు. రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. అయినా స‌రే ఆశించిన మేర ఫ‌లితాలు రావ‌డం లేద‌ని విచారం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే బరువు తగ్గడం మధ్యలోనే ఆగిపోవడాన్ని వెయిట్ లాస్ ప్లాటోగా పిలుస్తారు.

S

Lifestyle | Published On Feb 18, 2026, 6.42 am IST

Weight Loss Mistakes | బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారా..? ఈ త‌ప్పులు చేయ‌కండి..!
Advertisement

Weight Loss Mistakes | అధిక బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది క‌ఠిన‌మైన డైట్‌ను పాటిస్తుంటారు. రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. అయినా స‌రే ఆశించిన మేర ఫ‌లితాలు రావ‌డం లేద‌ని విచారం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే బరువు తగ్గడం మధ్యలోనే ఆగిపోవడాన్ని వెయిట్ లాస్ ప్లాటోగా పిలుస్తారు. ఈ స‌మ‌స్య చాలా మందిలో ఉంటుంది. అందుక‌నే ఎలాంటి డైట్‌ను పాటించినా, రోజూ వ్యాయామం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈ స‌మ‌స్య‌కు గుర‌వుతున్న‌వారు చాలా మంది అనేక ర‌కాల త‌ప్పుల‌ను చేస్తుంటార‌ని, అందువ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయా త‌ప్పుల‌ను చేయకుండా చూసుకుంటే బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

నీరు, విట‌మిన్ డి..

బరువు తగ్గే ప్రక్రియలో నీటి పాత్ర కీలకం. ఉదయం లేచిన వెంటనే తగినంత నీరు తాగితే మెటబాలిజం చురుకుగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొందరిలో ఆకలి కూడా తగ్గుతుంది. రోజంతా సరిపడా నీరు తాగకపోతే శరీరంలో కొవ్వు క‌రిగే ప్రక్రియ మందగించే అవకాశం ఉంటుంది. క‌నుక బ‌రువు త‌గ్గాలంటే రోజూ త‌గిన మోతాదులో నీటిని తాగాల‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే బరువు తగ్గడం కష్టమవుతుంది. ఉదయం సూర్యకాంతి పడితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది. రోజూ కొద్దిసేపు ఎండలో గడపడం బ‌రువు తగ్గడానికి దోహదపడుతుంది.

ఉద‌యం వ్యాయామం..

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఉదయం వ్యాయామం చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఖాళీ కడుపుతో చేసే వర్కౌట్ శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఎంత బిజీగా ఉన్నా ఉదయం కొద్దిసేపు వ్యాయామానికి కేటాయిస్తే తప్పక ఫ‌లితం కనిపిస్తుంది. రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం బ్రేక్‌ఫాస్ట్. దాన్ని వదిలేయడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాదు, రోజంతా అనారోగ్యకరమైన ఆహార అలవాట్లకు దారి తీస్తుంది. సమతుల్యమైన బ్రేక్‌ఫాస్ట్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌..

ఉదయం వేళ వేయించిన, ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకుంటే వెయిట్ లాస్ లక్ష్యానికి పెద్ద అడ్డంకి అవుతాయి. ఇవి అధిక చక్కెర, ఉప్పు కలిగి ఉండటంతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. బదులుగా పండ్లు, గింజలు వంటి సహజమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అధిక నిద్ర వల్ల బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం అవుతుంది. దాంతో మెటబాలిజం కూడా ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. క్రమబద్ధమైన నిద్ర, సమయానికి భోజనం అలవాటు చేసుకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఆయా త‌ప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. ఒక వేళ చేస్తుంటే వాటిని స‌రి చేసుకోండి. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గాలనుకునే ల‌క్ష్యం ఆటంకం లేకుండా సాగుతుంది.

Advertisement
Advertisement