FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..
FSSAI | భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పాఠశాలల్లో పిల్లలకు విక్రయించే ఆహార పదార్థాలపై కొత్త నిబంధనలు తీసుకురావడానికి ప్రతిపాదనలు చేసింది. ఇందులో అదనపు కొవ్వు, చక్కెర లేదా సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను గుర్తించేందుకు కొత్త పరిమితులను సూచించింది. పాఠశాల పిల్లలకు విక్రయించే ఆహారాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు చేశారు.
FSSAI | భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పాఠశాలల్లో పిల్లలకు విక్రయించే ఆహార పదార్థాలపై కొత్త నిబంధనలు తీసుకురావడానికి ప్రతిపాదనలు చేసింది. ఇందులో అదనపు కొవ్వు, చక్కెర లేదా సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను గుర్తించేందుకు కొత్త పరిమితులను సూచించింది. పాఠశాల పిల్లలకు విక్రయించే ఆహారాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు చేశారు. భారత ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించిన ముసాయిదా నోటిఫికేషన్‌లో ఈ వివరాలను వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (సేఫ్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్‌డ్ డైట్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ స్కూల్) అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్, 2026 పేరుతో ఈ ముసాయిదాను రూపొందించారు. పాఠశాలల్లో, పాఠశాలల పరిసర ప్రాంతాల్లో విక్రయించే ఆహార పదార్థాలకు సంబంధించిన 2020 నిబంధనలకు ఇది సవరణగా ఉంటుంది.
పరిమితులు ఎంత..
ప్రస్తుత నిబంధనల్లోని పర్యవేక్షణ, నిఘా అంశం తర్వాత కొత్తగా 7వ నిబంధనను చేర్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) 2024లో విడుదల చేసిన భారతీయుల ఆహార మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరిమాణాత్మక ప్రమాణాలను రూపొందించారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. ప్రతి 100 గ్రాముల ఘన ఆహార పదార్థంలో 4.2 గ్రాములకు మించి అదనపు కొవ్వు ఉంటే దానిని అధిక కొవ్వు కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. ద్రవ ఆహార పదార్థాల్లో ప్రతి 100 మిల్లీలీటర్లకు 1.5 గ్రాములకు మించి అదనపు కొవ్వు ఉంటే అధిక కొవ్వు విభాగంలోకి వస్తుంది. అదనపు చక్కెరకు సంబంధించి కూడా పరిమితులను నిర్ణయించారు. ప్రతి 100 గ్రాముల ఘన ఆహారంలో 3 గ్రాములకు మించి అదనపు చక్కెర ఉంటే దాన్ని అధిక చక్కెర కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. ద్రవ పదార్థాల్లో ప్రతి 100 మిల్లీలీటర్లకు 2 గ్రాములకు మించి అదనపు చక్కెర ఉంటే ఈ పరిమితిని దాటినట్లుగా పరిగణిస్తారు.
ఉప్పు అయితే..
ఉప్పు విషయంలో ప్రతి 100 గ్రాముల ఘన ఆహారానికి 0.625 గ్రాములకు మించి ఉప్పు ఉంటే అధిక ఉప్పు కలిగిన ఆహారంగా వర్గీకరించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ద్రవ ఆహార పదార్థాల్లో ప్రతి 100 మిల్లీలీటర్లకు 0.175 గ్రాములకు మించి ఉప్పు ఉంటే అధిక ఉప్పు విభాగంలోకి వస్తుంది. కాగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి డియాజియో లిక్కర్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు తీసుకుని 18వేల పెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రధాన కార్యనిర్వహణ అధికారి రజిత్ పున్హానీ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. 2006 నాటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని సెక్షన్ 92లోని ఉపవిభాగం 2లోని క్లాజ్ 5 కింద ఉన్న అధికారాలను వినియోగిస్తూ, కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో ఈ ముసాయిదాను రూపొందించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
60 రోజుల వరకు అభ్యంతరాల స్వీకరణ..
చట్టంలోని సెక్షన్ 92(1) ప్రకారం ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆహ్వానించింది. గెజిట్ ప్రతులు బహిరంగంగా అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రధాన కార్యనిర్వహణ అధికారికి పంపవచ్చు. ఇందుకోసం న్యూఢిల్లీలోని ఎఫ్‌డీఏ భవన్, కోట్లా రోడ్‌లోని కార్యాలయానికి సమర్పించవచ్చు లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారిక ఈ-మెయిల్ చిరునామాకు పంపవచ్చు. ఈ 60 రోజుల వ్యవధిలో అందిన అన్ని అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాతే తుది నిబంధనలను ఖరారు చేస్తామని నియంత్రణ సంస్థ తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి
- ●KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే
- ●RanaBaali | రణబాలి వాయిదా - రష్మికనే కారణమా ? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
- ●Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- ●CM Vijay | త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు.. సీఎం విజయ్‌పై దాడికి నటి పేరును అస్త్రంగా వాడుకుంటున్న ప్రతిపక్షాలు

CM Revanth Reddy | పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి

KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే

RanaBaali | రణబాలి వాయిదా - రష్మికనే కారణమా ? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!






