త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు.

S

Telangana | Published On Aug 11, 2026, 5.16 pm IST

CM Revanth Reddy | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు.

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్‌లో మెట్రో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లను జత చేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన కోచ్‌ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించి ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement