Mangoes | మామిడి పండును తింటే నిజంగానే బరువు పెరుగుతారా ? న్యూట్రిషనిస్ట్ క్లారిటీ..!
Mangoes | మామిడి సీజన్ వచ్చిందంటే చాలు, రుచికరమైన మామిడి ముక్కలు, ఆమ్ రస్, మామిడి డెజర్ట్‌లపై మనసు లాగిపోతుంది. అయితే మరోవైపు మామిడి తింటే బరువు పెరుగుతుందా?, ఇందులో చక్కెర ఎక్కువ కదా? అనే సందేహాలు కూడా చాలామందిని వెంటాడుతుంటాయి. ఈ కారణంగానే కొందరు మామిడిని పూర్తిగా దూరం పెడతారు.
Mangoes | మామిడి సీజన్ వచ్చిందంటే చాలు, రుచికరమైన మామిడి ముక్కలు, ఆమ్ రస్, మామిడి డెజర్ట్‌లపై మనసు లాగిపోతుంది. అయితే మరోవైపు మామిడి తింటే బరువు పెరుగుతుందా?, ఇందులో చక్కెర ఎక్కువ కదా? అనే సందేహాలు కూడా చాలామందిని వెంటాడుతుంటాయి. ఈ కారణంగానే కొందరు మామిడిని పూర్తిగా దూరం పెడతారు. కానీ నిజంగా మామిడి బరువు పెరగడానికి కారణమా? ఈ విషయంపై న్యూట్రిషనిస్ట్ అమితా గాద్రే వివరణ ఇచ్చారు. మామిడి పండు ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు. మామిడి ఒక మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) కలిగిన పండు. దీని జీఐ విలువ సాధారణంగా 51 నుంచి 60 మధ్య ఉంటుంది. అలాగే ఇందులో కేలరీలు కూడా చాలామంది అనుకున్నంత ఎక్కువగా ఉండవు. ఒక మామిడి పండులో ఉండే కేలరీలు సాధారణంగా ఒక వడా పావ్లో ఉండే కేలరీల కంటే తక్కువగా ఉంటాయి. వడా పావ్లో సుమారు 200 నుంచి 350 కేలరీలు ఉండగా, మామిడిలో అంతగా ఉండవు. అంతేకాకుండా మామిడిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
ఇలా తింటే రిస్కే..
అందుకే మామిడిని ఆరోగ్యకరమైన స్నాక్‌గా, డెజర్ట్‌గా లేదా వర్కౌట్‌కు ముందు తీసుకునే ఆహారంగా కూడా ఉపయోగించవచ్చని అమితా గాద్రే చెప్పారు. మామిడి బరువు పెంచుతుందనే అభిప్రాయం ఏర్పడటానికి అసలు కారణం దాన్ని తినే విధానమేనని తెలిపారు. మామిడిని ఆమ్ రస్, జ్యూస్, మిల్క్ షేక్, ఐస్‌క్రీమ్ లేదా ఇతర డెజర్ట్‌ల రూపంలో తీసుకున్నప్పుడు పరిస్థితి మారిపోతుంది. ఈ ప్రాసెసింగ్ వల్ల ఫైబర్ తగ్గిపోతుంది. శరీరంలో చక్కెర శోషణ వేగంగా జరుగుతుంది. అదనంగా చక్కెర, పాలు, క్రీమ్ వంటి పదార్థాలు కలవడంతో కేలరీలు కూడా పెరుగుతాయి. ఫలితంగా తెలియకుండానే ఎక్కువ కేలరీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
సహజ రూపంలోనే తినాలి..
మామిడిని వీలైనంత సహజ రూపంలో తినడం ఉత్తమమని అమితా గాద్రే సూచించారు. మామిడిని జ్యూస్ చేయకుండా నేరుగా పండుగా తినాలి. కొన్ని నట్స్‌తో కలిసి తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు. భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తింటే మామిడిలోని సహజ ఫైబర్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు కూడా పూర్తిగా మామిడిని మానాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటే చిన్న పరిమాణంలో మామిడి తినవచ్చు. మామిడిని నట్స్ లేదా మఖానా వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెరపై ప్రభావం మరింత సమతుల్యంగా ఉంటుంది.
మామిడి పండు స్వతహాగా బరువు పెరగడానికి కారణం కాదు. దాన్ని ఎలా, ఎంత మోతాదులో తీసుకుంటున్నామనేదే ముఖ్యమైన విషయం. మొత్తం పండును పరిమితంగా తింటే మామిడి సీజన్‌ను ఎలాంటి అపరాధ భావన లేకుండా ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
- ●Bakka Judson | కొండా సురేఖ రేవంత్‌నే కేర్ చేయద్.. ఇగ కడియం ఎంత
- ●AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్
- ●Vodafone Idea | రూ.200కే 20 ఓటీటీలు.. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
- ●MLC Dasoju Sravan | ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ..! ఎమ్మెల్సీ దాసోజు సెటైర్
- ●Katrina Kaif | అప్పుడు దీపికా ... ఇప్పుడు కత్రినా - ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లు
- ●NEET Row | నందన్ నీలేకని కమిటీలో ఉన్నది ఎవరు? టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుంది?

Bakka Judson | కొండా సురేఖ రేవంత్‌నే కేర్ చేయద్.. ఇగ కడియం ఎంత

AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్

Vodafone Idea | రూ.200కే 20 ఓటీటీలు.. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

MLC Dasoju Sravan | ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ..! ఎమ్మెల్సీ దాసోజు సెటైర్






