Digestive System And Sleep | జీర్ణవ్యవస్థకు, నిద్రకు ఏంటి సంబంధం..? శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు..?
Digestive System And Sleep | సాధారణంగా నిద్ర అనేది పూర్తిగా మనస్సు నియంత్రణలోనే ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే జీర్ణ వ్యవస్థపై కూడా నిద్ర ఆధార పడి ఉంటుందని తాజా పరిశోధనలు తేల్చాయి.
Digestive System And Sleep | సాధారణంగా నిద్ర అనేది పూర్తిగా మనస్సు నియంత్రణలోనే ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే జీర్ణ వ్యవస్థపై కూడా నిద్ర ఆధార పడి ఉంటుందని తాజా పరిశోధనలు తేల్చాయి. రోజూ మనం తీసుకునే ఆహారం కేవలం శక్తి స్థాయిలను నిర్వహించడమే కాకుండా, పోషకాలను అందించడం, రాత్రి పూట శరీరానికి ఎంత నిద్ర అవసరం అన్న విషయంపై కూడా ప్రభావం చూపిస్తుంది. జీర్ణ వ్యవస్థ, మెదడు మధ్య జరిగే సంక్లిష్టమైన సమాచార మార్పిడిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టి ఆయా వివరాలను వెల్లడించారు. శరీర జీవ గడియారం, మనోభావాలు, రాత్రి పూట విశ్రాంతి వంటి అంశాలను ఆ సమాచార మార్పిడి ప్రభావితం చేస్తుందని గుర్తించారు. శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాల ప్రకారం సాయంత్రం తీసుకునే ఆహారం నిద్ర నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది.
నిరంతరం సమాచార మార్పిడి..
జీర్ణ వ్యవస్థలో కొన్ని లక్షల కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిల్లో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. చెడు బ్యాక్టీరియాను బయటకు పంపించడంతోపాటు జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తిని పెంచడం, హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా నిద్రను కూడా ప్రభావితం చేస్తుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ సైంటిస్టులు ఈ మేరకు తమ అధ్యయన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన ప్రకారం ఆహారంలో చిన్నపాటి మార్పులు చేస్తే నిద్రపై, నిద్రలో చిన్నపాటి మార్పులు వస్తే జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతున్నట్లు గుర్తించారు. అందువల్ల జీర్ణ వ్యవస్థకు, మెదడుకు సమాచార మార్పిడి నిరంతరం జరుగుతుందన్నారు. నిద్ర సమయాల్లో వచ్చే చిన్న మార్పులు కూడా జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నిర్మాణంలో మార్పులకు దారి తీస్తాయని గుర్తించారు. 900 మందికి పైగా వ్యక్తులపై సైంటిస్టులు ఈ మేరకు పరిశోధనలు చేశారు. కేవలం 90 నిమిషాల నిద్ర సమయ మార్పు జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నిర్మాణంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని గమనించారు.
మంచి బ్యాక్టీరియా పరిమాణాల్లో మార్పులు వస్తే..
మంచి బ్యాక్టీరియా శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గించడతోపాటు మెటబాలిజంను మెరుగు పరిచేందుకు పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ-మెదడు సమాచార మార్పిడికి సహాయం చేస్తుంది. అందుకు అవసరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. అయితే ఈ సమతుల్యతలో మార్పులు చోటు చేసుకుంటే మెదడు సంకేతాలు ప్రభావితం అవుతాయి. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ, నిద్ర మధ్య సంబంధం ఒకే దిశలో కాకుండా ద్విముఖంగా ఉంటుంది. 2023లో ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం మంచి బ్యాక్టీరియా పరిమాణాల్లో మార్పులు వస్తే నిద్ర వ్యవధి, నిద్ర నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని తేలింది. అలాగే నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల తిరిగి జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. అందువల్ల ఇవి రెండూ ఒకదానికొకటి అనుబంధంగా పనిచేస్తాయి.

జీర్ణ వ్యవస్థకు, నిద్రకు బలమైన సంబంధం..
జీర్ణ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడితే నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర నాణ్యత తగ్గుతుంది. అలాగే సరిగ్గా నిద్రించకపోతే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. అయితే ఈ విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేయవచ్చు. దీంతో నిద్ర చక్రం కూడా మెరుగుపడుతుంది. నాణ్యమైన నిద్ర లభిస్తుంది. నిద్రకు భంగం కలగదు. ఆహారం జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాపై ప్రభావం చూపిస్తుంది. యూకే బయోబ్యాంక్ డేటాను ఉపయోగించి చేపట్టిన పరిశోధనల ప్రకారం ఆహార అలవాట్లు జీర్ణ వ్యవస్థ బ్యాక్టీరియా, నిద్ర నాణ్యత అంశాలపై ప్రభావం చూపిస్తాయని వెల్లడైంది. రెండింటి మధ్య బలమైన సంబంధం ఉందని తేలింది. ముఖ్యంగా కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుందని, అప్పుడు నిద్ర నాణ్యత తగ్గుతుందని తెలిపారు.
రాత్రి పూట వీటిని తీసుకోవాలి..
అయితే రాత్రి పూట కేవలం కొవ్వు పదార్థాలు మాత్రమే కాకుండా కెఫీన్ ఉండే టీ, కాఫీ వంటి పానీయాలు, మద్యం వంటి వాటిని కూడా తీసుకోకూడదు. ఇవి కూడా జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగిస్తాయి. రాత్రిపూట ఎక్కువగా ఫైబర్ ఉండే వృక్ష సంబంధిత ఆహారాలను, అంటే శాకాహారాలను అధికంగా తీసుకోవాలి. ఇవి మంచి బ్యాక్టీరియా నిర్మాణానికి సహాయం చేస్తాయి. అలాగే నిద్ర నాణ్యతను పెంచుతాయి. మెరుగైన నిద్ర కోసం జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు, విత్తనాలు, గింజల వంటి ఆహారాలను రాత్రి భోజనంలో భాగం చేసుకోవాలి. అలాగే రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోకూడదు. రాత్రిపూట ప్రోబయోటిక్ ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026

Cucumber | రాత్రిపూట కీరదోసను తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారు..?
మే 7, 2026

Foods During Journey | ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ ఆహారాలను అసలు తీసుకోకూడదు.. ఎందుకంటే..?
ఏప్రిల్ 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



