మొటిమే కదా అనుకుంటే.. మొదటికే మోసం వస్తుంది…జాగ్రత్త..!
మానిపోని చిన్న మొటిమ, 30 ఏళ్ల మహిళలో ఆటోఇమ్యూన్ వ్యాధి (SLE) మొదటి సంకేతంగా బయటపడింది. సరైన సమయంలో డాక్టర్లు గుర్తించడంతో చికిత్స సాధ్యపడింది. ఏ లక్షణాలు గమనించాలి? డాక్టర్ల హెచ్చరికలతో కూడిన పూర్తి కథనం.
Recurring ‘Pimple’ Turns Out to Be Autoimmune Warning: Doctors Explain Early Signs
(త్రినేత్ర హెల్త్ డెస్క్)
ముఖంపై చిన్న మొటిమ పోవటం లేదని చెప్పుకుంటూ 30 ఏళ్ల యువతి ఒకరు డాక్టర్ దగ్గరకు వచ్చిన కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. డాక్టర్… ఈ మొటిమ ఎప్పటికీ తగ్గట్లేదని డాక్టర్ సత్యం బడపండాకు చెప్పిన వెంటనే ఆ వైద్యుడికి సందేహం కలిగింది. ఎందుకంటే ఆ మొటిమ సాధారణ మొటిమలా కాకుండా ఎర్రగా, ఎక్కువ వాపుతో, ముఖ్యంగా అదే స్థానంలో మళ్లీ మళ్లీ వస్తూ ఉందని, నొప్పిగా కూడా ఉంటోందని చెప్పింది. అంతేకాక, ఆమె తలపోటు, కీళ్లలో నొప్పి, కొద్దిగా వెంట్రుకలు రాలిపోవడం కూడా ఉందని చెప్పడంతో డాక్టర్‌లు అనుమానపడ్డారు. వెంటనే CBC, ESR, CRP, ANA వంటి ప్రాథమిక పరీక్షలు చేశారు. రిపోర్టులు వచ్చిన తర్వాత చూస్తే, విషయం మరోలా ఉంది. రిపోర్టుల్లో ANA(Antinuclear Antibody) బాగా పాజిటివ్, ESR(Erythrocyte Sedimentation Rate) చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
అంటే ఇది మొటిమ కాదు.. ఇది Systemic Lupus Erythematosus (SLE) అనే ఆటోఇమ్యూన్ వ్యాధి తాలూకు మొదటి హెచ్చరిక అని స్పష్టమైంది. ఆటోఇమ్యూన్ వ్యాధి అంటే, సాధారణంగా మన శరీరంలోకి వ్యాధికారక క్రిములు ప్రవేశించినప్పుడు, మనలోని రోగ నిరోధక వ్యవస్థ వాటిని శత్రువులుగా గుర్తించి, పోరాడి అంతం చేస్తుంది. అయితే, మనలోని మంచి కణాలనే ‘పరాయి’విగా పొరబడి వాటిని చంపడానికి మన వ్యవస్థే పోరాడి నిర్మూలించినప్పుడు, మన శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. దీన్నే ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు.
చర్మంపై మొటిమలా కనిపించిన ఈ చిన్న కురుపు నిజానికి వ్యాధి సంకేతం. అంటే శరీరం తనపై తనే దాడి చేస్తున్నదన్నదానికి సూచన. మీదకి మొటిమలా కనిపించినా, లోపల శరీరం చేసే పోరాటం మాత్రం చాలా పెద్దది. ఈ విషయంలో ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అమిత్ సరాఫ్ మరో ముఖ్య వ్యాఖ్య చేశారు. శరీరం ఒకేసారి పెద్ద హెచ్చరికలు ఇవ్వదు, మొదట చిన్నచిన్న సంకేతాలతోనే చెబుతుంది. అదే చోట మళ్లీ మళ్లీ వచ్చే మొటిమ, తగ్గని వాపు, సాధారణ యాక్నీ కంటే ఎక్కువ నొప్పి.. ఇవన్నీ చర్మం చెబుతున్న లోపలి కథలే.
సరైన సమయంలో గుర్తించడమే మొదటి చికిత్స

అలాగే అలసట, జాయింట్ నొప్పులు, హెయిర్ ఫాల్ వంటి లక్షణాలు కూడా కలిసి కనిపిస్తే, అది రోగ నిరోధక వ్యవస్థలో అసమతుల్యత మొదలైందని అర్థం. చాలామంది ఈ లక్షణాలను పట్టించుకోరు. కానీ ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపించినప్పుడు మాత్రం వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఇలాంటి సందర్భాల్లో ESR, CRP, ANA వంటి రక్తపరీక్షలే మొదటి ఆధారాన్ని ఇస్తాయి. వాపు ఎంత ఉంది? రోగ నిరోధక వ్యవస్థలో ఏదైనా ‘అతి’ ప్రతిస్పందన ఉందా అనేది ఈ పరీక్షలు బయటపెడతాయి. ఆటోఇమ్యూన్ వ్యాధులు మొదట్లోనే గుర్తిస్తే, అవయవాలకు నష్టం జరగకుండా నివారించవచ్చు.
ఈ యువతి విషయంలో చికిత్స లక్ష్యం SLEని పూర్తిగా నయం చేయడం కాదు, స్థిరంగా నియంత్రించడం. ఇందులో:
- ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే మందులు
- ఇమ్యూన్ రెస్పాన్స్‌ను శాంతింపజేసే చికిత్స
- క్రమం తప్పకుండా పరీక్షలు
- జీవనశైలిలో చిన్న మార్పులు
ఇలా ఉంటాయి. సరైన చికిత్సతో, ఈ వ్యాధి ఉన్నా కూడా మంచి, ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చు. అందుకే మన శరీరంపైన కనిపించే అసాధారణ మార్పులు, నిరంతరంగా నలతగా ఉండటం లాంటివి ఉన్నప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఒకోసారి చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు.
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ





