వెండి ధరిస్తే ఇంత అదృష్టమా.! శుభవార్త చెబుతున్న జ్యోతిష్యం
వెండి ధరించడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, గ్రహ దోషాల నివారణ వంటి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. శక్తివంతమైన చంద్ర ప్రభావంతో మనస్సు, శరీరం బలపడతాయి. వెండి వల్ల చంద్ర–శుక్ర గ్రహాలు బలపడి అంతా మంచే జరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
Devotional | Published On Dec 13, 2025, 11.35 am IST
Amazing Benefits of Wearing Silver: Astrology, Health & Spiritual Impact
భారతీయులకు బంగారంపై ఎంత మమకారమో ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. శుభకార్యం అంటే బంగారం కొనడం, ఆభరణాలంటే బంగారం.. ఇలా మన సంస్కృతిలో కలిసిపోయింది. కానీ ఇదే సమయంలో వెండి మాత్రం ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే చిన్నచిన్న వస్తువుల వరకే పరిమితం అయిపోయింది. అయితే జ్యోతిషశాస్త్రం, ఆరోగ్య శాస్త్రం రెండూ చెబుతున్న సంగతేమంటే, బంగారం కన్నా వెండి ధరిస్తే అదృష్టం మరింతగా చేరుతుంది, ఆరోగ్యపరంగా కూడా అనేక శుభఫలితాలు లభిస్తాయి. వెండిని శుభప్రదమైన, శక్తివంతమైన లోహంగా ఎందుకు భావిస్తారో తెలుసుకుంటే నిజంగానే బంగారం సంగతి మరిచిపోతారేమో!
వెండి ధరించినవారికి అదృష్టం ప్రసాదించే చంద్ర–శుక్ర గ్రహాలు

శాస్త్ర నమ్మకం ప్రకారం వెండి శివుని నేత్రం నుండి ఉద్భవించిన పవిత్ర లోహం. జ్యోతిష్య పరంగా వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే వెండి ధరించడం వల్ల శరీరంలోని నీటి మూలకం సమతుల్యం చెందుతుంది, మనో స్థిరత్వం పెరుగుతుంది, భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి అంటారు నిపుణులు. చంద్ర దోషం ఉన్నవారికి, మనసు అస్థిరత, ఆందోళన, భయం ఎదురవుతున్నవారికి వెండి ప్రత్యేకంగా అనుకూలమని చెబుతారు. అలాగే శుక్ర గ్రహాన్ని బలపరిచే లోహంగా కూడా వెండినే సూచిస్తారు. శుక్రుడు బలపడితే సౌఖ్యం, సంపద, సౌభాగ్యం, శాంతి..ఇవన్నీ ఇంట్లోనే నివసిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. అందుకే వెండి వస్తువులు ఉన్న ఇళ్ళలో సుఖసంపద పెరుగుతుందనే నమ్మకం బలంగా ఉంది.
ఉంగరం, గొలుసు, కంకణాలు, బ్రాస్లెట్, కాలిపట్టీలు, ఇలా ఏ రూపంలోనైనా వెండి ధరించడం వల్ల జాతకంపై శుభప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలివి, నిర్ణయసామర్థ్యం, గ్రహణశక్తి మెరుగుపడుతుందని, పిల్లలు, విద్యార్థులు, మానసిక ఒత్తిడితో ఉన్న వారికి వెండి ఎంతో ఉపకరిస్తుందని అంటారు. బంగారంతో పోలిస్తే వెండి ధరించడం శరీర శోషణ వేగంగా జరుగుతందనేది అనేది పురాతన వైద్యం చెబుతున్న మరో ఆసక్తికర అంశం.
వెండి ఆభరణాలు ఆరోగ్య కారకాలంటున్న పరిశోధనలు

వెండి ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే గొప్పవి. శరీరంలోని విషాలను బయటకు పంపించే గుణం రజతానికి ఉంది. ఇదే కారణంగా పురాతనకాలంలో వెండి పాత్రల్లో నీళ్లు త్రాగేవారు, భోజనం చేసేవారు. చర్మం ప్రకాశవంతం కావడం, ఇన్‌ఫెక్షన్లు తగ్గడం వెండి వల్లే సాధ్యమని ఆయుర్వేదం పేర్కొంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారికి వెండి ఉంగరం, వెండి కంకణం ధరిస్తే నొప్పి, వాపు, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో వెండి శరీరానికి సహకరించే లక్షణం కూడా వైద్యపరంగా రుజువైంది.
తక్కువ ఖర్చుతో లభించే లోహం కావడంతో, మధ్యతరగతి కుటుంబాలకు ఇది అందుబాటులో ఉంటుంది. ఆధ్యాత్మికంగా శుభప్రదం, జ్యోతిష్యపరంగా అనుకూలం, వైద్యపరంగా కూడా మేలు చేసే లోహం.. ఇలా మూడు కోణాల్లోనూ వెండి ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అందుకే నిపుణులు చెబుతున్న మాటేంటంటే—ఇంట్లో వెండి ఎక్కువగా ఉపయోగిస్తే సుఖం, సౌభాగ్యం, ఆరోగ్యం.. మూడూ కలిసి వస్తాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ






