త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijaya Dairy | రాష్ట్రంలో కొత్త‌గా 400 డెయిరీ విజ‌య డెయిరీ పార్ల‌ర్లు.. నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధికి ఛాన్స్‌..!

Vijaya Dairy | తెలంగాణ  పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య వ్యాపార‌ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేసింది. ఈ క్ర‌మంలో కొత్త‌గా 400 విజ‌య డెయిరీ పార్ల‌ర్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 200 పార్ల‌ర్లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

P

Karimnagar | Published On Jan 12, 2026, 8.49 pm IST

Vijaya Dairy | రాష్ట్రంలో కొత్త‌గా 400 డెయిరీ విజ‌య డెయిరీ పార్ల‌ర్లు.. నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధికి ఛాన్స్‌..!
Advertisement

Vijaya Dairy | తెలంగాణ  పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య వ్యాపార‌ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేసింది. ఈ క్ర‌మంలో కొత్త‌గా 400 విజ‌య డెయిరీ పార్ల‌ర్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 200 పార్ల‌ర్లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో డిమాండ్ మేర‌కు పార్ల‌ర్ల‌ను పెంచాల‌ని భావిస్తున్న‌ది. విస్త‌ర‌ణ‌లో భాగంగా నిరుద్యోగ యువ‌త‌కు స్వ‌యం ఉపాధికి అవ‌కాశం క‌ల్పించాల‌ని స‌మాఖ్య నిర్ణ‌యించింది. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌, లుంబినీ పార్క్, సికింద్రాబాద్, ఈఎస్‌ఐ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జేఎస్టీయూ మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద కొత్త‌గా పార్ల‌ర్ల‌ను ప్రారంభించారు. అలాగే, న‌గ‌రంలోని మ‌రికొన్ని ప్రాంతాల‌తో పాటు వ‌రంగ‌ల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్దిపేట త‌దిత‌ర జిల్లాల్లో కొత్త పార్ల‌ర్ల‌ను ప్రారంభించ‌నున్నారు.

ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో సొంతంగా, లేదంటే అద్దె ప్రాతిప‌దిక‌న స్థ‌లం ఉండి, ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించుకునే వారికి ఈ డెయిరీ పార్ల‌ర్‌ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఆస‌క్తి ఉన్న వ్య‌క్తులు రూ.25వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంద‌ని డెయిరీ చైర్మ‌న్ గుత్తా అమిత్‌రెడ్డి, ఎండీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల‌ను ఎంపిక చేస్తామ‌న్నారు. మార్కెట్‌లో విజ‌య డెయిరీకి మంచి డిమాండ్ ఉంద‌ని పేర్కొన్నారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యితో పాటు ఇత‌ర ఉత్ప‌తుల‌పై క‌మిష‌న్ ఉంటుంద‌ని తెలిపారు. షాపు అడ్వాన్స్, ఇంటీరియర్, రిఫ్రిజిరేటర్ల కోసం సుమారు రూ.2ల‌క్ష‌ల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబ‌డి అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని, పార్ల‌ర్ ఉన్న స్థ‌లాన్ని బ‌ట్టి రూ.50వేల వ‌ర‌కు ఆదాయం పొంద‌వ‌చ్చ‌ని అధికారులు వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement