త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | సిరిసిల్ల నడిబొడ్డున కేటీఆర్‌, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్

తమకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డా పెట్టి ఓటుకు రూ.10 వేలు పంచుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్.. నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా అని బెదిరించారు.

J

Karimnagar | Published On Feb 4, 2026, 6.01 pm IST

Bandi Sanjay | సిరిసిల్ల నడిబొడ్డున కేటీఆర్‌, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్
Advertisement

Bandi Sanjay | మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ బిజీ అయ్యాయి. బుధవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారి అని, గాంధీభవన్‌లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంసారం చేస్తున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు పెడుతూ వాళ్లే బీఫామ్‌లు పంచుతున్నారన్నారు. స్పీకర్‌‌కి ఇవన్నీ కనిపించడం లేదా? స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయాలని సిరిసిల్ల ప్రజలకు సూచించారు. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటేయాలని ప్రశ్నించాలన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వద్ద నయాపైసా లేదు.. వాళ్లకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. వాళ్ల దగ్గర రూపాయి లేకనే ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నారన్నారు. మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో వస్తున్నారన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే 5 ఏళ్ల అరిగోస తప్పదని స్పష్టం చేశారు.

తమకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డా పెట్టి ఓటుకు రూ.10 వేలు పంచుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్.. నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా అని బెదిరించారు. కేంద్రం నిధులిస్తే ఆ నిధులను మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారన్నారు.

https://x.com/bandisanjay_bjp/status/2019024261709766870

 

Advertisement

తాజావార్తలు

Advertisement